రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టిటిడి తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టిటిడి అర్చకులు వేదమంత్రాల నడుమ ఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారు. టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ, ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments