విద్యుత్
సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు మరియు అగ్ని ప్రమాదాల నివారణపై టీటీడీ విద్యుత్ విభాగం సిబ్బందికి గురువారం తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ శ్రీ జె.పద్మ జనార్ధన్ రెడ్డి సిబ్బందికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, ముందస్తు జాగ్రత్త చర్యలు వంటి పలు టెక్నికల్ అంశాలపై అవగాహన కల్పించారు.
అనంతరం టీటీడీ ఏడీఎఫ్ఓ శ్రీ పి.అనిల్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈ శ్రీ చంద్ర శేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి వాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments