2.4.26

అయోధ్యను తలపించిన కళ్యాణ వేదిక కళాకృతులు kalyana vedika





ఒంటిమిట్టలో జ‌రుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా  త్రేతాయుగంనాటి అయోధ్యను గుర్తుకు తెచ్చేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు.

 

వేదిక రంగురంగుల పుష్పాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోందివేదికపైప్రాచీన ఆలయాలలోని దశావతారాల సెట్టింగురామాయణంలోని ఘట్టాలతో యాక్రిలిక్ పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందిసీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు పుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.

 

తెలుగుదనం ఉట్టిపడేలా   చెరుకులుటెంకాయ గెలలుటెంకాయపూతరటి ఆకులు,  మామిడాకులు,  హెలికానియమ్స్టార్చ్ జింజర్నీలం ఆర్కిడ్‌రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారుఇందుకోసం 5 టన్నుల సంప్రదాయ పుష్పాలు,  50 వేల కట్‌ ఫ్లవర్స్‌  వినియోగించారు


అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో అత్యద్భుతంగా పుష్పాలంకరణలు చేపట్టారు.

 

టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజులపాటు 100 మంది అలంకరణ నిపుణులుమరో 100 మంది టీటీడీ సిబ్బంది  ఇందుకోసం నిచేశారు.

 

No comments :
Write comments