తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ. 78,000 విలువైన రెండు ఎయిర్ కండీషనర్ యంత్రాలను హైదరాబాద్‌కు చెందిన భక్తులు శ్రీ పూజ కౌశిక్, శ్రీమతి స్వాతి కౌశిక్ బుధవారం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు దాతలు ఏసీలను అందజేశారు. వీటిని ఆలయ పరాకామణి విభాగంలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments