f
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి.
సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు సుప్రసిద్ధ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అనంతరం స్వామి దేవేరులతో కలిసి విహరిస్తూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యకమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments