ఒంటిమిట్టలోని
శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ.ముఖ్యమంత్రి దంపతులకు టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా సీఎంకి శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు.
No comments :
Write comments