6.4.26

“పుష్పయాగంలో భక్తి పరిమళాలు – శ్రీ కోదండరాముని దివ్య అర్చన వైభవం” puspa yagam








ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దివారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిఆలయ శుద్ధినిత్యారాధనలు నిర్వహించారుసాయంత్రం గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.


తులసీదళాలుమల్లెలురోజాలుచామంతులుగన్నేరుసంపంగిమొగలి దళం వంటి పుష్పాలుపత్రాలతో స్వామిఅమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారుఆంధ్రప్రదేశ్తమిళనాడుకర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి.


ప్రకృతి వైపరీత్యాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూభూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారుఅలాగే నిత్యకైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా  యాగాన్ని చేస్తారని అర్చకులు తెలిపారు.

 యాగం ద్వారా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెప్పారు.


 కార్యక్రమంలో టిటిడి బోర్డు భ్యులు శ్రీ సదాశివ రావుడిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిగార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు,  టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments