5.4.26

ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం repakula subbamma thota




తిరుపతి శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములులక్ష్మణస్వామి వారికి శ‌నివారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది.


ఉదయం 9.30 గంటలకు శ్రీ కోదండరామాలయం నుండి శ్రీ సీతారాముల సమే లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట(ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌)కు ఊరేగింపుగా తీసుకొచ్చారుఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనంఆస్థానంనివేదన నిర్వహించారు.


సాయంత్రం 5 గంటలకు స్వామివారి రేగింపుగా రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామాలయానికి చేరుకున్నారు.


శ్రీకోదండరామస్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలుఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించేవారు. 1910 సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనంసర్వభూపాల వాహన సేవలను సొం ఖర్చులతో నిర్వహించేవారుతన తదనంతరం కూడా  సేవలు కొనసాగాలనే తలంపుతో 1933 సంవత్సరంలో కొం స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరంఆర్‌ఎస్‌ గార్డెన్స్‌ ఉన్నాయికోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా  ఉత్సవం నిర్వహిస్తోంది.


 కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ వో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్‌ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments