1.4.26

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం teppotsavams






తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు .


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవసహస్రనామార్చన నిర్వహించారుఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెచందనంకొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.


సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారువిద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments