2.4.26

ఘ‌నంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు teppotsavams






తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీకోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి


 సందర్భంగా ఆలయంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగానిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బ‌రినీళ్ళుప‌సుపుచందనంతో స్వామిఅమ్మవార్లఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వ‌హించారు.


అనంతరం సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు  ఆలయం నుండిబయల్దేరి రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారువిద్యుద్దీపాలుపుష్పాలతోఅందంగా అలంకరించిన తెప్పపై స్వామిఅమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగిభక్తులకు దర్శనభాగ్యం కల్పించారు


తెప్పోత్సవం అనంతరం స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.


తెప్పోత్స‌వంలో ఆల‌య డెప్యూటీ వో శ్రీమతి నాగ‌ర‌త్న‌టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ఇతర అధికారులువిశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments