9.4.26

భక్తులను మరింత ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు: టిటిడి జేఈవో డా.ఎ. శరత్ ttd jeo







శ్రీవారి భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీప్రసారాలను విస్తరించనున్నట్లు టిటిడి జేఈవో (వైద్యంవిద్యమరియు ఇంఛార్జి సీఈవో డాశరత్ తెలిపారుబాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కార్యాలయానికి చ్చిన ఆయనబుధవారం వివిధ శాఖల ప్రతినిధులుసిబ్బందితో సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా మాట్లాడుతూరోజువారీ కార్యక్రమాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందేలా కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. “శతమానంభవతి” కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించి ప్రతి భక్తునికీ శ్రీవారి ఆశీర్వచనంఅక్షింతలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. “దివ్యానుభూతి” కార్యక్రమాన్ని మరింత సులభంగాఅందరికీ చేరువగా తీసుకువస్తామని చెప్పారు.


సోషల్ మీడియా వేదికల ద్వారా ఆకర్షణీయమైన భక్తి కార్యక్రమాలుభక్తుల అనుభవాలనుఇతర కార్యక్రమాలను మరింత విస్తృతంగా భక్తులకు చేరవేయనున్నట్లు తెలిపారుతెలుగుతమిళంకన్నడహిందీ భాషల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలను మరింత నాణ్యంగా అందిస్తామని పేర్కొన్నారు.


ఎస్వీబీసీ ద్వారా శ్రీవారి నిత్యసేవలుఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు ఆధ్యాత్మికానుభూతి కలిగిస్తున్నామని తెలిపారువేదాలుఉపనిషత్తులునాతన ధర్మాన్ని విస్తరించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడంతో పాటుశ్రీవారి వైభవాన్ని మరింత పేరొందిన పండితుల వ్యాఖ్యానాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


అనంతరం కార్యాలయంలో ప్రసారాల రూపకల్పనరికార్డింగ్కంటెంట్కెమెరాలుఆడియో మిక్సింగ్డైలీ ప్రోగ్రామ్ చార్ట్ వంటి అంశాలను పరిశీలించిఅన్ని వివరాలు క్రమబద్ధంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

No comments :
Write comments