9.4.26

వేదాలకు పుట్టినిల్లు తిరుమల - ధర్మగిరిలో శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం మహోన్నత ప్రస్థానం veda patashala







భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద సంప్రదాయాల పరిరక్షణప్రచారం మరియు ప్రోత్సాహంలో టీటీడీ అగ్రగామిగా నిలుస్తోంది దిశగా తిరుమలలోని ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం దేశంలోనే అత్యున్నత వేద విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది.


వేద విజ్ఞాన పీఠం చ‌రిత్ర‌


1884 ఫిబ్రవరిలో మహంత్ ప్రయాగ్ దాస్ జీ ఆధ్వర్యంలో స్థాపించబడి  వేదపాఠశాల ప్రారంభంలో మూడు విభాగాలతో మొదలై కాలక్రమేణా వేదఆగమపౌరోహిత్యంశాస్త్ర విద్యలను సమగ్రంగా బోధించే విశిష్ సంస్థగా అభివృద్ధి చెందింది. 1992లో తిరుమల ధర్మగిరిలో శాశ్వతంగా స్థాపించబడిన  సంస్థకు “వేద విజ్ఞానపీఠంగా పునర్నామకరణం చేశారు.


17 విభాగాల్లో వేద విద్యా బోధ‌న‌


ప్రస్తుతం  విజ్ఞానపీఠంలో నాలుగు ప్రధాన విభాగాల కింద మొత్తం 17 ప్రత్యేక విద్యా శాఖలు నిర్వహించబడుతున్నాయివేదాధ్యయనంలో 7 వేదశాఖలుఆగమాధ్యయనంలో 5 ఆగమాలుస్మార్త అధ్యయనంలో 4 విభాగాలుదివ్యప్రబంధంలో ఆళ్వారుల‌ 4000 పాశురాలు బోధించబడుతున్నాయి కోర్సులు దీర్ఘకాలికంగా నిర్వహించబడుతూ విద్యార్థులకు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నాయి.


 విద్యాసంస్థలో ప్రస్తుతం మొత్తం 374 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారుఅందులో వేద కోర్సుల్లో 140 మందిప్రబంధ-ఆగ కోర్సుల్లో 177 మందిస్మార్త కోర్సుల్లో 57 మంది ఉన్నారువీరికి బోధన అందించేందుకు 43 మంది పండితులు సేవలందిస్తున్నారు.


విద్యార్థుల సంక్షేమానికి అత్యం ప్రాధాన్య‌త‌


విద్యార్థుల సంక్షేమానికి టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 540 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉన్న హాస్టల్ సౌకర్యాలుశుభ్రమైన నివాస వాతావరణం, 24 గంటల నీటి సరఫరావేడి నీటి సదుపాయం అందుబాటులో ఉన్నాయివిద్యార్థుల‌కు పోషకాహారంతో కూడిన భోజనం అందించేందుకు ఉదయం పాలు, ఇడ్లీదోసెఉప్మా వంటి వంటకాలుమధ్యాహ్నం అన్నంపప్పుకూరలుసాంబారురసంపెరుగుసాయంత్రం పాలురాత్రి భోజనం అందిస్తున్నారు


అదనంగా విద్యార్థులకు ఉచితంగా దుస్తులుపుస్తకాలునిత్యావసర స్తువులు (సబ్బులునూనెలుపేస్ట్ మొదలైనవిఅందించబడుతున్నాయిఆరోగ్య పరిరక్షణ కోసం అశ్విని ఆసుపత్రి ద్వారా ప్రతిరోజూ వైద్య సేవలు అందించబడుతుండగాఅవసరమైతే తిరుప‌తిలోని స్విమ్స్బ‌ర్డ్‌ ఆసుపత్రుల్లో కూడా ఉచిత చికిత్స అందిస్తున్నారు.


విద్యార్థుల భ‌విష్య‌త్తుకు భ‌రోసా


వేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యే ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోందివేద కోర్సుల విద్యార్థుల పేరుపై రూ.3 లక్షలుఇతర కోర్సుల విద్యార్థులకు రూ.ఒక‌ లక్ష డిపాజిట్ చేస్తోందికోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా మొత్తం అందజేసి మెరిట్ సర్టిఫికేట్‌తో పాటు శ్రీవారి 10 గ్రాముల వెండి డాలర్ ప్రదానం చేస్తారు.


వేదాచారాల ఆధారంగా స‌మ‌గ్ర విద్యా విధానం


విద్యార్థుల దినచర్య పూర్తిగా వేదాచారాల ఆధారంగా క్రమబద్ధంగా అమలవుతోందిఉదయం సంధ్యావందనంఅగ్నికార్యం నుంచి ప్రారంభమై పఠనంబోధనపారాయణంక్రీడలురాత్రి ధ్యయనం వరకు సమగ్ర విద్యా విధానంలో కొనసాగుతోంది.


పండితుల‌ను ఆక‌ర్షిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు


వేదశాస్త్రఆగమ జ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్ పండితులను ఆకర్షిస్తోందిసంప్రదాయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను సత్కరించడం  సదస్సు ప్రత్యేకతఇటీవల మార్చి 8 నుండి 13 వరకు  కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.



టీటీడీ ఆధ్వర్యంలో ధర్మగిరితో పాటు కీసరగుట్టనల్గొండభీమవరం, కొటప్పకొండవిజయనగరం వంటి ప్రాంతాల్లో కూడా వేద విజ్ఞానపీఠాలు విజయవంతంగా నడుస్తున్నాయి. “వేదాలకు పుట్టినిల్లు తిరుమల” అనే మహోన్నత భావాన్ని సార్థకం చేస్తూ శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే దివ్య విద్యా కేంద్రంగా నిలుస్తోంది.


No comments :
Write comments