14.5.26

వైభవంగా రిషికేష్‌ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 15న వైభవోపేతంగా కల్యాణోత్సవం rishikesh temple




హిమాలయ పర్వత శ్రేణుల నడుమ పవిత్ర గంగాతీరాన వెలసిన రిషికేష్‌ ఆంధ్రాశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మే 12 ప్రారంభమైన ఉత్సవాలు మే 16 తేదీ వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఇందులో భాగంగా మే 15 జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.


బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 13 ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మికానందాన్ని పంచారు. మే 14 ఉదయం శేషవాహనం, రాత్రి గజవాహన సేవలు నిర్వహించనున్నారు.


మే 15 ఉదయం సింహవాహన సేవ అనంతరం రాత్రి శ్రీ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. నంతరం వృషభవాహన సేవ నిర్వహిస్తారు. మే 16 ఉదయం త్రిశూలస్నానం, తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ధ్వజావరోహణం, రావణాసుర వాహన సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


మే 15 కల్యాణోత్సవం


బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం మే 15 సాయంత్రం 4.30 గంటలకు జరుగనుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.501/- టికెట్‌ కొనుగోలు చేసి దివ్యోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు.


సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తూ భక్తులను అలరిస్తున్నారు.

No comments :
Write comments