31.5.26

జూన్ 2న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam




కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూన్ 2 తేదీ ఉదయం 7.30 గంటల నుండి 11 గంటల వరకు వైభవంగా జరుగనుంది


ఏడాది బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14 తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.


మహోన్నత కార్యక్రమం అనంతరం ఉదయం 11.30 గంటల నుండి భక్తులను స్వామివారి సర్వ దర్శనానికి అనుమతించనున్నారు.


No comments :
Write comments