భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే శ్రీ వేద నారాయణ స్వామివారి కంచి గరుడసేవ మే 29న నాగలాపురం ఆలయంలో వైభవంగా జరగనుంది. కంచిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే మహా గరుడసేవను పురస్కరించుకొని నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో ఈ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ వేద నారాయణ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి దివ్య మంగళ విహారాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు.
No comments :
Write comments