5.5.26

తేనెలొలికే పదాలతో అలమేల్మంగను అలరించిన అన్నమయ్య : శ్రీమతి నాగపద్మిని alavelumangamma


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ణనా వైచిత్రి నిరుపమానమనిఆయన సంకీర్తనల్లో శృంగార నాయికల భావాలను మధురభక్తితో అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి నాగపద్మిని తెలిపారుఅన్నమయ్య 618 జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం రెండవ రోజు సాహితీ సదస్సు ఘనంగా జరిగింది.


సదస్సుకు అధ్యక్షత వహించిన ఆమె అన్నమయ్య తీర్చిన అలమేల్మంగా” అనే అంశంపై ఉపన్యసిస్తూఅన్నమయ్య శృంగార సంకీర్తనల భావ వైశాల్యం అపారమని పేర్కొన్నారుయన కీర్తనల్లో మధురభక్తిసాహిత్య సౌందర్యం సమన్వయంగా ప్రతిఫలిస్తుందని వివరించారు.

పలుకు తేనెల తల్లి…”, “ఏమని పొగడుదమే…”, “అలరులు కురియగా…” వంటి సంకీర్తనల్లో అలమేల్మంగా అమ్మవారిని మాధుర్యభరితంగా వర్ణించిన తీరు విశిష్టమని తెలిపారు.


డాఆముదాల మురళి “అన్నమయ్య అద్వైత తత్వంపై మాట్లాడుతూశరణాగతిలోకనీతివేదసారాన్ని సమన్వయపరిచి అన్నమయ్య సాహిత్యం నిర్మించారని చెప్పారుభక్తి సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.


డాషేక్ షావళి “అన్నమయ్యసూరదాసుల సంకీర్తనల్లో నవవిధ భక్తి” అంశంపై మాట్లాడుతూభగవత్ సంకీర్తన ద్వారా మోక్షం సిద్ధిస్తుందని వివరించారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డామేడసాని మోహన్సంచాలకులు శ్రీమతి లతఅధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారుఅనంతరం సాయంత్రం గాత్ర సంగీతంనృత్య కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.


మహతి కళాక్షేత్రంలో...


మహతి కళాక్షేత్రంలో కూడా సాయంత్రం 6 గం.లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సుశీల బృందం భక్తి సంగీత కార్యక్రమంరాత్రి 7 గం.లకు శ్రీ పద్మ కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ వారి నృత్య కార్యక్రమం జరుగనుంది

No comments :
Write comments