2.5.26

ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ఆరంభమైన శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు brahmotsavams





నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణ మహోత్సవంతో వార్షి బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.


 వేదపండితుల మంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాల నినాదాలుభక్తుల గోవింద నామస్మరణల మధ్య  పవిత్ర కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.


ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు ఉత్సవం ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు పర్యవేక్షిస్తారని ఆధ్యాత్మి విశ్వాసం.


అనంతరం ఉదయం 5.30 నుండి 6.30 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ట్టం వైఖానస ఆగమ విధానంలో ఘనంగా నిర్వహించారుగరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై ఆవిష్కరించిపూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారుదీని ద్వారా 18 గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు భావిస్తారు.


తదుపరి ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామిఅమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగిందిపాలుపెరుగుతేనెపసుపుచందనంకొబ్బరినీళ్లతో అభిషేకం నిర్వహించి భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తారు.


సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్ సేవరాత్రి 7.30 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసే జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ చంగల్ రాయులుఅర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments