చెన్నైకు చెందిన శ్రీ గోపాల కృష్ణ, శ్రీ పురుషోత్తం అనే భక్తులు బుధవారం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సుమారు నాలుగున్నర కేజీల బరువు గల వెండి నక్షత్ర హారతులను విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు నక్షత్ర హారతులను అందజేశారు.
అదేవిధంగా మంగళవారం మైసూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.10కోట్లు విలువైన ఐదు బంగారు పతకాలను విరాళంగా అందించారు.

No comments :
Write comments