VIDEO
తిరుపతి
శ్రీ గోవిం దరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రెం డో రోజైన ఆదివారం రాత్రి శ్రీ గో విందరాజస్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అభయప్రదా తగా వెలుగొందారు . రాత్రి 7 గం టలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది .
వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా… చెక్ కభజనలు, కోలాటాలు, గోవింద నామస్ మరణలతో తిరుపతి మాడవీధులు మారు మోగాయి. మంగళవాయిద్యాల నడుమ స్ వామివారి వాహనసేవను తిలకించిన భ క్తులు అడుగడుగునా కర్పూర హారతు లు సమర్పించి దివ్యానుభూతిని పొం దారు.
హంసవాహనం – జ్ఞానానికి ప్రతీక
బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా పురాణాలు పే ర్కొంటాయి. పాలను నీటిని వేరుచే సే హంస స్వభావం ఆత్మానాత్మ వివే కానికి సంకేతం. అందుకే పరమాత్ మతో ఏకత్వం పొందిన మహనీయులను “ ప రమహంసులు” గా ఉపనిషత్తులు అభివర్ ణించాయి. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకే శ్ రీహరి హంసవాహనాన్ని అధిరోహిస్తా డని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరి స్తున్నాయి.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్ రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్ రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏ ఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరిం టెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపు ల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయు లు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్ యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments