నారాయణవనంలోని
శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతీ దేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు.
జ్ఞానానికి ప్రతీకమైన హంసవాహనంపై విరాజిల్లిన కల్యాణ శ్రీనివాసుడు భక్తుల హృదయాలను భక్తి పరవశంలో ముంచెత్తారు. పురాణాల ప్రకారం హంస వివేకానికి, పరమజ్ఞానానికి చిహ్నంగా భావించబడుతుంది.
భక్తులలో అహంకారాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని కలిగించేందుకే స్వామివారు హంసవాహనాన్ని అధిరోహిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.
ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్రాయులు, ఇతర అధికారులు, అర్చకులు तथा విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments