14.5.26

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో భక్తులకు వేగవంతంగా శ్రీవారి దర్శనం integrated control center





వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్నప్పటికీ టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకపాత్ర పోషిస్తోంది.


తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసా కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహం వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.


భక్తులు ప్రాంతంలో ఎక్కువసేపు వేచి ఉండకుండా క్యూ లైన్లను సమతుల్యం చేయడం, అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించడం, తాగునీరు, పాలు, అన్నప్రసాదం, వైద్య సేవలు వేగంగా అందించడం వంటి చర్యలు సమన్వయంతో కొనసాగుతున్నాయి. దీంతో దర్శన సమయ నియంత్రణలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది.


ప్రత్యేకించి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో భక్తుల రద్దీని డిజిటల్ మానిటరింగ్ ద్వారా అంచనా వేసి, దానికి అనుగుణంగా భక్తులను విడతల వారీగా ముందుకు పంపించే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ భక్తులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా దర్శనానికి చేరుకుంటున్నారు.


టీటీడీ అమలు చేస్తున్న ఆధునిక ద్దీ నిర్వహణ విధానాల వల్లే క్యూలైన్లలో భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలిచిపోయే పరిస్థితులు లేకుండా, సాంకేతిక ఆధారంగా టీటీడీ యంత్రాంగం సమన్వయంతో భక్తులను వేగంగా దర్శనానికి పంపిస్తున్నారు.


టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగిస్తూ భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ ధికారులు 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తున్నారు.


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పరిశుభ్రత, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై టీటీడీ ప్రత్యే దృష్టి సారించడంతో పాటు భక్తు సహకారంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత సాఫీగా కొనసాగుతోంది.


ప్రస్తుతం వేసవి రద్దీ నేపథ్యంలో శని, ఆదివారాల్లో దాదాపు 85 వేలమందికి పైగా భక్తులకు దర్శనం చేయించడం జరుగుతోంది. అదేవిధంగా సాధారణ రోజుల్లో దాదాపు 75వే మంది భక్తులకు పైగా దర్శనం చేసుకునేందుకు టీటీడీ యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. మే 2 తేదిన అత్యధికంగా 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం.


తేది      2024 మే    2025 మే    2026 మే

-----------------------------------------------

మే 1      72,510     57,863     71,008

మే 2      65,313     74,344     91,005

మే 3      62,624     84,113     83,091

మే 4      77,848     83,380     70,996

మే 5      81,927     65,095     76,240

మే 6      76,748     69,214     71,029

మే 7      65,146     71,001     70,001

మే 8      64,766     64,850     67,222

మే 9      65,508      6,821     81,512

మే 10     60,545     85,078     85,942

మే 11     76,945     80,423     78,985

మే 12     80,001     68,760     80,389

-----------------------------------------------

మొత్తం   8,49,881   8,10,942   9,27,420

No comments :
Write comments