31.5.26

ముత్యాల పందిరి కింద గీతామృతం పంచిన కల్యాణ శ్రీనివాసుడు గీతోపదేశ కృష్ణుడి అలంకారంలో భక్తులను కరుణించిన స్వామివారు mutyala pandiri




నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది.


సందర్భంగా అనంత తేజోమూర్తి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో ముత్యపుపందిరి వాహనంపై దివ్యంగా దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహం, ముత్యాల కాంతుల మధ్య ప్రకాశిస్తూ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.


ముత్యపుపందిరి వాహనం శాంతి, శీతలత్వం, పవిత్రతకు ప్రతీకగా భావించబడుతుంది. ముత్యాల చల్లని నీడలో విహరించిన శ్రీనివాసుని దర్శనం భక్తుల తాపత్రయాలను తొలగించి, వారి జీవితాల్లో ఆధ్యాత్మిక ప్రశాంతతను నింపుతుందని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.


వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు,  విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.


No comments :
Write comments