దేవుని
కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం స్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments