తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments