VIDEO
తిరుమలలో
భక్తుల సేవల నిర్వహణలో కృత్రిమ మేధస్సు (ఏఐ ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగిస్తున్న తీరు ప్ రశంసనీయమని కేంద్ర వాణిజ్య , పరి శ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గో యల్ అన్నారు .
శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వేం కటేశ్వర స్వామివారిని దర్శించు కున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందిం చగా, టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచం ద్ర శ్రీవారి తీర్థప్రసాదాలు, చి త్రపటాన్ని అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియా తో మాట్లాడుతూ, వైకుంఠం క్యూ కాం ప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటి గ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ( ఐసీసీసీ) ద్వారా వసతి గ దుల ఆక్యుపెన్సీ వివరాలు, భక్తు ల రాకపోకలు, దర్శన క్యూ లైన్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీ వంటి అం శాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చడం వల్ల భక్తులకు మరింత పారదర్ శకంగా, సమర్థవంతంగా సేవలు అందు తున్నాయని చెప్పారు.
ఈ కేంద్రం ద్వారా గదుల లభ్యత, వి విధ కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తుల సంఖ్య, గంటల వారీగా తి రుమలకు చేరుకుంటున్న భక్తుల వి వరాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ స మాచారం తక్షణమే అందుబాటులోకి వస్తోం దని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్ రి శ్రీ నారా లోకేష్ సాంకేతి కతను ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభి వృద్ధికి కృషి చేస్తున్నారని కొ నియాడారు. ఈ ప్రాజెక్టుకు సహకరిం చిన ప్రవాస భారతీయ భక్తులకు కృ తజ్ఞతలు తెలియజేస్తూ, కేవలం 100 రోజుల లోపే ఏఐ ఆధారిత వ్యవస్ థను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ అధికారులను అభినందించారు .
అంతకుముందు ప్రపంచ పర్యావరణ ది నోత్సవాన్ని పురస్కరించుకుని ని ర్వహించిన " ఏక్ పేడ్ మా కే నామ్ " కార్యక్రమంలో పాల్గొని మొక్ కను నాటారు. తిరుమలలో తన తల్లి పేరుతో మొక్క నాటడం ఎంతో సంతో షాన్ని కలిగించిందన్నారు. ఈ కా ర్యక్రమం దేశవ్యాప్తంగా పర్యా వరణ పరిరక్షణపై అవగాహన పెంపొందిం చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి చిన్నారి తమ తల్లి పేరు మీ ద ఒక మొక్కను నాటి, జీవితాంతం దా నిని సంరక్షించాలని పిలుపునిచ్ చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్ రమం పచ్చదనం పెంపొందించడంతో పా టు పర్యావరణ పరిరక్షణకు దోహదపడు తుందని తెలిపారు.
ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారం లో తన జన్మదినం సందర్భంగా తిరు మలను సందర్శించి శ్రీవారి ఆశీస్ సులు పొందడం ఆనవాయితీగా కొనసాగు తోందని చెప్పారు. దేశ సేవకు, ప్ రజల సంక్షేమానికి మరింత కృషి చే సేలా శ్రీవారిని ప్రార్థించినట్ లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి. హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments