ఆంధ్రప్రదేశ్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.
ముందుగా ఆలయానికి విచ్చేసిన గౌరవ ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న సీజే
అంతకుముందు జస్టిస్ లీసా గిల్ తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకోగానే సీజేకు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీమతి నాగరత్న, విజిఓ శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments