నారాయణవనంలోని
శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి స్వామివారు శ్రీనివాస దర్బార్ అలంకారంలో గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
గజవాహనంపై రాజసంగా విహరించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్నాయి.
గజేంద్ర మోక్షాన్ని స్మరింపజేసిన గజవాహన సేవ
ఆర్తత్రాణ పరాయణుడైన భగవంతుడు భక్తుల పిలుపుకు వెంటనే స్పందించి రక్షిస్తాడనే సందేశాన్ని గజవాహనోత్సవం తెలియజేస్తుంది. సర్వం విడిచి తననే శరణు వేడిన గజేంద్రుడిని రక్షించినట్లే, తనను విశ్వసించి శరణాగతి పొందిన భక్తులందరికీ అభయాన్ని ప్రసాదిస్తాననే దివ్య సందేశాన్ని స్వామివారు గజవాహన సేవ ద్వారా అందించారు.
3వ తేదీన సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు
బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన బుధవారం ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments