2.6.26

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు భక్తులకు దివ్య దర్శనాలు, విశేష సేవల మహోత్సవం govindarajaswmay vari temple




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.


జూన్ 2 నుండి 4 వరకు

🔸 వదాయతి ఉత్సవం


జూన్ 5

🔸 వసంతోత్సవం


జూన్ 6

🔸 ఖనిజతోట ఉత్సవం


జూన్ 12, 19, 26 (శుక్రవారాలు)

🔸 సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా నిర్వహిస్తారు.


జూన్ 14

🔸 రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి ఊరేగింపు మాడ వీధుల్లో జరుగుతుంది.


జూన్ 16 నుండి 25 వరకు

🔸 శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం


జూన్ 21

🔸 శ్రీ గోవిందరాజస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణం


జూన్ 22

🔸 శ్రీ గోవిందరాజస్వామివారి పుష్పయాగం


జూన్ 29

🔸 పౌర్ణమి గరుడసేవ


విశేష ఉత్సవాలలో భక్తులు పెద్ సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టిటిడి కోరుతోంది.

No comments :
Write comments