3.6.26

దివ్య సుగంధాలతో పరిమళించిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం koil alwar thirumanjanam




కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే పవిత్ర కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించారు.


ఆలయ ఆగమ సంప్రదాయాల ప్రకారం ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగం ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి ఆధ్యాత్మిక పరిమళాలతో ఆలయాన్ని నింపివేశారు.


మహోన్నత కార్యక్రమం అనంతరం ఉదయం 11.30 గంటల నుండి భక్తులను ర్వదర్శనానికి అనుమతించారు.


జూన్ 6 నుండి 14 వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు


ప్రతిరోజూ ఉదయం, రాత్రి వైభవోపే వాహనసేవలు


భక్తులను అనుగ్రహించేందుకు శ్రీ వేణుగోపాలస్వామివారు ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వివిధ దివ్య వాహనాలపై విహరించనున్నారు.


వాహన సేవల విశేషాలు


జూన్ 6 – ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం

జూన్ 7 – చిన్నశేష వాహనం, హంస వాహనం

జూన్ 8 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం

జూన్ 9 – కల్పవృక్ష వాహనం, కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

జూన్ 10 – మోహినీ అవతారం, గరుడ వాహనం

జూన్ 11 – హనుమంత వాహనం, గజ వాహనం

జూన్ 12 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

జూన్ 13 – రథోత్సవం, అశ్వవాహనం

జూన్ 14 – చక్రస్నానం, ధ్వజావరోహణం


జూన్ 9 కల్యాణ మహోత్సవం


దంపతులకు స్వామివారి కృపాకటాక్షాలు


బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 9 శ్రీ వేణుగోపాలస్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రూ.300 చెల్లించి ఇద్దరు గృహస్తులు సేవలో పాల్గొనవచ్చు. పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవికెతో పాటు లడ్డూ, అప్పం ప్రసాదంగా అందజేయనున్నారు.


జూన్ 15 భక్తిశ్రద్ధల మధ్య పుష్పయాగం


బ్రహ్మోత్సవాల అనంతరం జూన్ 15 తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4 గంటల వరకు శ్రీ స్వామివారికి పుష్పయాగం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది పుష్పాలతో స్వామివారిని అర్చించి విశే పూజలు సమర్పించనున్నారు.


భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది.

No comments :
Write comments