శ్రీ
వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్ మరియు డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
భక్తులు శ్రీవారి దర్శనం, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో మరియు కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 65 కౌంటర్లు ఏర్పాటు చేసి 345 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.
టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో 51,38,976 మంది భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో 20,75,481 మంది భక్తులు తమ లగేజీని భద్రపరచుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 23,15,279 మంది భక్తులు తమ లగేజీని భద్రత పరచుకున్నారు. గత ఏడాది మే నెలలో 23,82,622 తమ లగేజీని భద్రపరచుకోగా, ఈ ఏడాది 28,23,697 మంది భక్తులు తమ లగేజీని భద్రపరచుకున్నారు.
అంటే గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే 2,39,798 లగేజీ డిపాజిట్లు, మే నెలతో పోల్చితే 4,41,075 లగేజీ డిపాజిట్లు అత్యధికంగా నమోదు కావడం విశేషం.
అదేవిధంగా తిరుమలలో రద్దీ పెరిగిన నేపథ్యంలో గత మూడు రోజుల్లో 3,41,742 మంది ఉచిత లగేజీ సేవలు వినియోగించుకున్నారు.
కాలినడక భక్తులకు ప్రత్యేక డిపాజిట్ సౌకర్యం:
అలిపిరి మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అలిపిరి కాలినడక మార్గం లగేజీ కేంద్రం వివరాలు
• 5 కౌంటర్లు.
• 45 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది).
• 10,194 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం.
శ్రీవారి మెట్టు లగేజీ కేంద్ర వివరాలు
• 2 కౌంటర్లు.
• 10 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 5 మంది).
• 3,025 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం.
ఈ కేంద్రాల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.
తిరుమలలో ప్రధాన డిపాజిట్ కేంద్రాలు
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం లగేజీ మరియు సెల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉంది.
• ఫ్రీ హాల్ – 8 కౌంటర్లు, 20 సిబ్బంది (17,291 సెల్ ఫోన్లు, 7,793 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
• వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2 కౌంటర్లు, 12 సిబ్బంది (4,270 సెల్ ఫోన్లు).
• నారాయణగిరి షెడ్ – 5 కౌంటర్లు, 45 సిబ్బంది (11,941 సెల్ ఫోన్లు, 6,749 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
• డీడీ హాల్ – 3 కౌంటర్లు, 18 సిబ్బంది (2,526 సెల్ ఫోన్లు, 324 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
• రూ.300 హాల్ – 4 కౌంటర్లు, 36 సిబ్బంది (6,338 సెల్ ఫోన్లు, 1,600 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
• వైకుంఠం క్యూకాంప్లెక్స్ అప్ స్కానింగ్ (కంపార్ట్‌మెంట్-03) – 2 కౌంటర్లు, 12 సిబ్బంది.
కల్యాణకట్ట సమీపంలో ప్రత్యేక డిపాజిట్ – డెలివరీ కేంద్రాలు
తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట సమీపంలో కూడా ప్రత్యేక కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది.
KKC 1, 2, 3 – 3 కౌంటర్లు, 18 సిబ్బంది (షిఫ్ట్-06) (688 సెల్ ఫోన్లు, 820 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
సుపథం కౌంటర్ – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02) (1,286 సెల్ ఫోన్లు, 245 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
సీనియర్ సిటిజన్ / దివ్యాంగులు (PHC) – 1 కౌంటర్, 2 సిబ్బంది (265 సెల్ ఫోన్లు, 75 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం)
VQC-1 మెయిన్ గేట్ (శ్రీవాణి ట్రస్ట్) – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02)
తిరుమలలో లగేజీ డెలివరీ కేంద్రాలు
డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి పొందేందుకు ఈ క్రింది డెలివరీ కేంద్రాలు పనిచేస్తున్నాయి:
అలిపిరి ఫుట్‌పాత్ డెలివరీ (జీఎన్సీ వద్ద) – 5 కౌంటర్లు, 45 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది), 9,345 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం.
No comments :
Write comments