4.6.26

ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడి orient college




టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది.

బి.. (.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ విభాగాలలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ప్రీ-డిగ్రీ (ఇంటర్‌మీడియట్‌కు సమానం) కోర్సులో సంస్కృతం, తెలుగు, హిందీ విభాగాలలో కూడా అడ్మిషన్లు జరుగనున్నాయి.

ఉచిత హాస్టల్‌, భోజన సదుపాయాలు

ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించబడుతుంది. అదనంగా ఉచిత భోజన వసతి కూడా అందుబాటులో ఉంటుంది.

అర్హతలు

రెండేళ్ల ప్రీ-డిగ్రీ కోర్సులకు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు ర్హులు.

మూడేళ్ల డిగ్రీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, ప్రీ-డిగ్రీ, ఇంటర్‌మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల సమర్పణ

జూన్ 17, 2026 నుండి సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. కె.టి. రోడ్డులోని ఎస్వీ ప్రాచ్య కళాశాల కార్యాలయంలో రూ.25 చెల్లించి దరఖాస్తు ఫారాలు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31, 2026 లోపు సమర్పించాలి.

మరిన్ని వివరాలకు 9848642346, 6281894208 నంబర్లలో సంప్రదించవచ్చని కళాశాల అధికారులు తెలిపారు.

No comments :
Write comments