తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు.
ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపారు.
సాయంత్రం ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేసి, తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ లు శ్రీ సురేష్, శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చలపతి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments