15.6.26

అధికారుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు tirumala rush











వేసవి సెలవులు ముగిస్తుండటంతో పాటు రెండో శనివారం, ఆదివారం తోడవ్వడంతో తిరుమలకు భక్తులు గత మూడు రోజుల నుండి పోటెత్తారు. నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  నిరంతరాయంగా సేవలు అందిస్తోంది.


వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1,2, నారాయణగిరి షెడ్లు బయట క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో అనునిత్యం పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.


 అధికారుల పర్యవేక్షణ:


టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అన్న ప్రసాదం విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, శ్రీవారి సేవా విభాగం పర్యవేక్షకులు సీపీఆర్వో డాక్టర్ టి.రవి తో పాటు వివిధ కళ్యాణ కట్టలను విభాగాధిపతి శ్రీ రమాకాంత్, అశ్విని ఆసుపత్రి మెడికల్  సూపరింటెండెంట్ డా. సుబ్బారెడ్డి,  భద్రతా విభాగం వీజీవో శ్రీ సురేంద్రలు తమ బృందాలతో క్యూలైన్లలో భక్తులకు తమ తమ విభాగాల అందిస్తున్న  సౌకర్యాలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు


అన్న ప్రసాద విభాగం :


క్యూలైన్లలో 29 పాయింట్లలో భక్తులకు అన్న ప్రసాద పంపిణీ చేస్తున్నారు. ఒక్కో పాయింట్ దగ్గర నలుగురు మంది శ్రీవారి సేవకులు భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు


ఇంజనీరింగ్ విభాగం :


అదేవిధంగా 37 పాయింట్లలో తాగునీటి కుళాయిలను ఇంజనీరింగ్ అధికారులు  ఏర్పాటు చేశారు. ఇవి బాట గంగమ్మ వద్ద గల 69 గేట్ నెంబర్ నుండి నారాయణ గిరి షెడ్ల వద్ద ఉన్న సర్వీస్ లైన్ గేట్ నెంబర్ 1 వరకు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.


 ఆరోగ్య విభాగం:


మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ధ్వర్యంలో  క్యూలైన్లలో 49 పాయింట్లలో త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేసి ఒక్కో డ్రమ్ము వద్ద ద్దరు సేవకులు సేవాలoదిస్తారు


Outside lines వద్ద శాశ్వత మరుగుదొడ్లతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ర్పాటు చేసి, వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. అదేవిధంగా చెత్త పేరుకుపోకుండా నిమిషాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది విశే కృషి చేస్తున్నారు.


నిఘా మరియు భద్రత విభాగం:


టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.


బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వరకు మరో 29 బ్లాకులను ఏర్పాటు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా, క్రమ పద్ధతిలో క్యూలైన్లలో వేచి ఉంటున్నారు


ఒక్కో బ్లాకులో 150 మంది భక్తులు వేచి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, అదనపు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరు శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు.


గుణాంకాలు :


గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.


మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు సతి పొందేందుకు వీలుగా టీటీడీ ర్పాట్లు చేసింది. ఐదు ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వేల లాకర్లు అందుబాటులో ఉన్నాయి.


భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గత మూడు రోజుల్లో 1,34,637 మంది భక్తులు తలనీలాలు మర్పించడం విశేషం. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. క్షురకులు భక్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు.


మరో పక్క భక్తులు సేవలో పోటు విభాగం, రవాణా, తదితరులు కూడా తమ విధులను నిరంతరాయంగా అందిస్తున్నారు.


టీటీడీ అధికారులు, సిబ్బంది, దర్శ క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రమిస్తున్నారు.

No comments :
Write comments