1.5.26

శాస్త్రోక్తంగా శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ankurarpanam at nagalapuram temple



నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం భక్తి వైభవంతో ఘనంగా నిర్వహించారువేదఘోషల మధ్య నిర్వహించిన  పవిత్ర కార్యక్రమం ఆలయాన్ని ఆధ్యాత్మిక కాంతులతో అలంకరించింది సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపితోమలసేవఅర్చన వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారుఅనంతరం సాయంత్రం మృత్సగ్రహణంసేనాధిపతి ఉత్సవం జరిపిబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా చేపట్టారు.


ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం


మే 1 ఉదయం మేష లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయిఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, 5.30 నుండి 6.30 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారుప్రతిరోజూ ఉదయంరాత్రి వాహన సేవలుస్నపన తిరుమంజనంఊంజల్ సేవలు నిర్వహించి భక్తులకు దివ్యానుభూతిని కలిగించనున్నారు.


బ్రహ్మోత్సవాల ప్రధాన కార్యక్రమాలు


 01-05-2026

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

 02-05-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

 03-05-2026

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

 04-05-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

 05-05-2026

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

 06-05-2026

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

 07-05-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

 08-05-2026

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – ఆర్జిత కల్యాణోత్సవం

రాత్రి – అశ్వవాహనం

 09-05-2026

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం


 భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు – ఆధ్యాత్మిక కళోత్సవాల సందడి


బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు దివ్యశోభతో కళకళలాడుతున్నాయిచలువ పందిళ్లురంగవల్లులతో దేవాలయం మరింత సౌందర్యవంతంగా తీర్చిదిద్దారుభక్తుల సౌకర్యార్థం అన్నదానంతాగునీరువైద్య సేవలు సహా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుదాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలుభజనలుసంగీతసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు భక్తి కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక నందసంద్రంలో ముంచెత్తనున్నాయి.


 కార్యక్రమంలో టీటీడీ అధికారులుప్రధాన అర్చకులు శ్రీ నాగరా భట్టాచార్యులుటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుచెంగల్ రాయులుఅర్చకులుభక్తులు పాల్గొన్నారు.


Ankurarapanam for Sri Venakteswara Swamy Vari Temple Brahmotsavams at New Delhi



Ankurarpanam for the annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, New Delhi, was performed on Thursday evening as per tradition.


All arrangements are in place for the Brahmotsavams, which will commence with Dwajarohanam on May 1. Daily Vahana Sevas and rituals will be conducted.


Devotees are invited to participate and seek the blessings of the Lord.

Ankurarpanam for Narapura Venkateswara Swmay Vari Brahmotsavams


Ankurarpanam for the annual Brahmotsavams of Sri Narapura Venkateswara Swamy Temple, Jammalamadugu, was performed on Thursday evening as per tradition.


The Brahmotsavams will begin with Dwajarohanam on May 1. The temple has been beautifully decorated and arrangements are in place for devotees.


Officials and priests participated in the rituals.

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్ర క్తంగా అంకురార్పణ - మే 1న ధ్వజారోహణం jammalamadugu temple



జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ రిగిందిఅంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపికొలువుపంచాంగ శ్రవణం నిర్వహించారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనంమృత్సంగ్రహణంసేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.


  కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారుభక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలువిద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.


మే 1 ధ్వజారోహణం :


మే 1 తేదీ శుక్ర‌వారం ఉదయం 9. 30 నుంచి 10.15 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam


తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 1 తేదీ జరుగనున్న ప‌త్ర‌పుష్పయాగానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది సందర్భంగా విఘ్నేశ్వర పూజపుణ్యాహవచనంఅంకురార్పణనవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.


మే 1 ఉదయం 7 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీ సోమ‌స్కంద‌మూర్తిశ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారుఉద‌యం 10 నుండి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యా మ‌హోత్స‌వం జ‌రుగ‌నుందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిసంపంగిరోజాకలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలుప‌త్రాలతో అభిషేకం చేస్తారుసాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుందిగృహ‌స్తులు(ఇద్ద‌రురూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.


ఆలయంలో బ్రహ్మోత్సవాలుఇతర ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులుభ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.


 కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ వో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఅధికారులు పాల్గొన్నారు.

Lakshmi Venateswara Swamy Vari Teppotsavam Held Grandly


As part of the Teppotsavam at Devuni Kadapa, Sri Lakshmi Venkateswara Swamy along with Sridevi and Bhudevi gave darshan to devotees on Thursday.


The deity was taken on a float ride with five rounds in the temple tank, blessing devotees.


Special rituals were performed and a large number of devotees participated.

తిరుమలలో ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి tarigonda vengamamba





శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296 జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి రిణయ మండపంలో గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.


ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారుఅనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టుఎస్వీ సంగీనృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహించారుఇందులో వెంగమాంబ రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు.


 సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారురిగొండ వెంగమాంబ సజీవ సమాధి అనే అద్భుతాన్ని మనం చూస్తున్నామనిసజీవ సమాధి అనేది శరీరం ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే అత్యున్నత యోగస్థితి అని తెలిపారుమరణంచీకటి వంటి భయాలను భగవన్నామస్మరణతో అధిగమించవచ్చని, ''ఓం నమో వెంకటేశాయ'' అనే అష్టాక్షరీ మంత్రమే మోక్షానికి మార్గమని పేర్కొన్నారుతిరుమల వంటి దివ్య క్షేత్రానికి రావడం తన పూర్వ జన్మ పుణ్యఫలమనిభగవన్నామస్మరణ ద్వారానే భక్తులు పరిపూర్ణ ఆనందాన్ని పొందగలరని తెలియజేశారు.


 కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి సువర్ణమ్మతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి


తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో గురువారం సాయంత్రం టీటీడీ అధికారులువెంగమాం వంశీకులు పుష్పాంజలి ఘటించారు.