చిత్తూరు జిల్లా గంగవరం (మం), కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మే 5 నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. గజేంద్ర, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ కోనేటిరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మే 4న సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.
రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
05-05-2025
ఉదయం - ధ్వజారోహణం (కర్కాటక లగ్నం- మధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంటల వరకు)
సాయంత్రం - పెద్ద శేష వాహనం
06-05-2025
ఉదయం - చిన్న శేషవాహనం
సాయంత్రం - హంస వాహనం
07-05-2025
ఉదయం - సింహ వాహనం
సాయంత్రం - ముత్యపుపందిరి వాహనం
08-05-2025
ఉదయం - కల్పవృక్ష వాహనం
సాయంత్రం - సర్వభూపాల వాహనం
09-05-2025
ఉదయం - మోహినీ ఉత్సవం
సాయంత్రం - శ్రీవారి కల్యాణోత్సవం, గరుడ వాహనం
10-05-2025
ఉదయం - హనుమంత వాహనం
సాయంత్రం - వసంతోత్సవం, గజ వాహనం
11-05-2025
ఉదయం - సూర్యప్రభ వాహనం
సాయంత్రం - చంద్రప్రభ వాహనం
12-05-2025
ఉదయం - రథోత్సవం
సాయంత్రం - అశ్వవాహనం
13-05-2025
ఉదయం - చక్రస్నానం
సాయంత్రం - ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 6వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
11-05-2025
ఉదయం - ధ్వజారోహణం (ఉదయం 10.50 నుండి 11.15 గంటల వరకు)
సాయంత్రం - పెద్దశేషవాహనం
12-05-2025
ఉదయం - చిన్నశేషవాహనం
సాయంత్రం - హంసవాహనం
13-05-2025)
ఉదయం - సింహవాహనం
సాయంత్రం - ముత్యపుపందిరి వాహనం
14-05-2025
ఉదయం - కల్పవృక్షవాహనం
సాయంత్రం - సర్వభూపాలవాహనం
15-05-2025
ఉదయం - పల్లకీ ఉత్సవం
సాయంత్రం - గరుడవాహనం
16-05-2025
ఉదయం - హనుమంత వాహనం
సాయంత్రం - గజవాహనం
17-05-2025
ఉదయం - సూర్యప్రభ వాహనం
సాయంత్రం - చంద్రప్రభ వాహనం
18-05-2025
ఉదయం - రథోత్సవం
సాయంత్రం - శ్రీవారి కల్యాణోత్సవం, అశ్వవాహనం
19-05-2025
ఉదయం - చక్రస్నానం (ఉదయం 9 నుండి 9.45 గంటల వరకు)
సాయంత్రం - ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 18వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .501/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
The Annual Brahmotsavams of Sri Venkateswara Swamy temple will be conducted from May 11 to 19 at the Andhra Ashram in Rishikesh, Dehradun district, Uttarakhand.
As part of the festivities, the traditional Koil Alwar Tirumanjanam will take place on May 6 while the Ankurarpanam is scheduled on May 10.
Daily Vahana Sevas will be held from 7:30AM to 9 AM and 7PM to 8:30 PM, with the following schedule:
May 11, 2025
Morning: Dwajarohanam (Temple Flag Hoisting) – 10:50 AM to 11:15 AM
Evening: Pedda Sesha Vahanam
May 12, 2025
Morning: Chinna Sesha Vahanam
Evening: Hamsa Vahanam
May 13, 2025
Morning: Simha Vahanam
Evening: Muthyapu Pandiri Vahanam
May 14, 2025
Morning: Kalpavruksha Vahanam
Evening: Sarvabhouma Vahanam
May 15, 2025
Morning: Pallaki Utsavam
Evening: Garuda Vahanam
May 16, 2025
Morning: Hanumantha Vahanam
Evening: Gaja Vahanam
May 17, 2025
Morning: Surya Prabha Vahanam
Evening: Chandra Prabha Vahanam
May 18, 2025
Morning: Rathotsavam
Evening: Sri Vari Kalyanotsavam and Ashwa Vahanam
May 19, 2025
Morning: Chakrasnanam (9AM to 9:45 AM)
Evening: Dwajavarohanam
As part of the festivities, Srivari Kalyanotsavam will be performed on May 18.
Two Devotees can participate by paying Rs.501 per ticket. They will receive a Uttariyam, Blouse Bit, and Annaprasadam as prasadams.
In connection with the Brahmotsavams, the Hindu Dharma Prachara Parishad, Annamacharya Project, and Dasa Sahitya Projects of TTD will jointly organize daily spiritual discourses, devotional music, cultural performances, bhajans, and kolatams.
అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యులపై సాహితీ సదస్సు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ " శ్రీ రామానుజాచార్ల వైభవం" పై ఉపన్యసిస్తారు. తరువాత తిరుపతికి చెందిన శ్రీ కె. సరస్వతి ప్రసాద్ బృందం భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది.
మే 1న సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన డా.కె.టి.వి.రాఘవన్ " శ్రీ రామానుజాచార్యులు - శ్రీ వైష్ణవతత్వం " పై ప్రసంగిస్తారు. తరువాత ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు హరికథ గానం చేస్తారు. మే 2న సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ కె.ఇ. లక్ష్మీనరసింహన్ " శ్రీ రామానుజాచార్యులు - తిరుమల కైంకర్యాలు " అనే అంశంపై ఉపన్యసిస్తారు. అనంతరం శ్రీమతి ఆర్. బుల్లెమ్మ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.
The Alwar Divya Prabandha Project of TTD is organizing Sri Bhagavad Ramanujacharya Avatara Mahotsavams from April 30 to May 2 at Annamacharya Kalamandiram in Tirupati.
As part of the three-day celebrations, literary discourses and devotional music programs dedicated to Sri Ramanujacharya will be conducted every evening from 6 PM to 8:30 PM.
The festival will commence on April 30 at 5:30 PM with the blessings of Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swami and Sri Sri Sri Chinna Jeeyar Swami.
This will be followed by a discourse by Acharya Chakravarthi Ranganathan on the topic “Sri Ramanujacharya Vaibhavam”.
Later, Sri K. Saraswati Prasad and team from Annamacharya Project will present a devotional music program.
On May 1 at 6 PM, Dr. K.T.V. Raghavan from will deliver a lecture on “Sri Ramanujacharya – The Essence of Sri Vaishnavism”, followed by a Harikatha presentation by Sri Venkateswarlu, faculty member of SV College of Music and Dance.
On May 2 at 6 PM, Sri K.E. Lakshmi Narasimhan of Tirupati will speak on “Sri Ramanujacharya and Tirumala Kainkaryams”.
The event will conclude with a devotional music performance by Smt. R. Bullemma and team from Annamacharya Project.
మల్టీ పర్పస్ క్లీనింగ్ కు ఉపయోగించే రూ.25 లక్షలు విలువైన రైడ్ ఆన్ స్వీపిర్ మెషిన్ మంగళవారం టీటీడీకి విరాళంగా అందింది. అధునాతన జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ మెషిన్ బ్యాటరీ తో పని చేస్తుంది.
శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి రోస్సరి ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన ప్రతినిధులు మెషిన్ ను అందజేశారు.
A Ride on Sweeper machine worth Rs.25 lakhs, designed for multipurpose cleaning, was donated to TTD on Tuesday.
This advanced machine built with German technology, operates on battery power.
Representatives from Rossari Profesional Company handed over the machine to TTD Additional Executive Officer Sri Ch Venkaiah Chowdary in front of the Srivari Temple.