1.5.25

భక్తి ఉద్యమంతో సంఘాన్ని సంస్కరించిన మహనీయుడు రామానుజాచార్యులు :- టీటీడీ తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి






భక్తి ఉద్యమంతో సమానత్వాన్ని బోధించి సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు భగవద్‌ రామానుజాచార్యులని టిటిడి తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు బుధ‌వారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ, ఆదిశేషుని అవతారమైన భగవద్‌ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని, శ‌ర‌ణాగ‌తి భ‌క్తితో భ‌గ‌వంతుని కొలిస్తే దివ్య‌త్వం క‌లుగుతుంద‌ని అన్నారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్‌ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. శ్రీ రామానుజార్యుల అవతార మహోత్సవాలను టీటీడీ ఘ‌నంగా నిర్వహిస్తోంద‌న్నారు.
అనంతరం అహోబిలం మఠంకు చెందిన శ్రీ సీతారామన్ “శ్రీ రామానుజ వైభవం”పై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ స‌ర‌స్వ‌తి ప్ర‌సాద్‌ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ రాజగోపాల రావు, ప్రోగ్రాం కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, పురప్రజలు పాల్గొన్నారు.

Sri Bhrigu Maharshi and Sri Srinivasa Makhi Tirunakshatrams




The Tirunakshatram of the revered Vaikhanasa Acharyas, Sri Bhrigu Maharshi and Sri Srinivasa Makhi, was celebrated with grandeur on Wednesday evening in Tirumala.

The event took place at the Asthana Mandapam under the aegis of the TTD’s Alwar Divya Prabandha Project and the Vaikhanasa Divya Siddhanta Vardhini Sabha.
Eminent Vaikhanasa Agama scholars including Sri Prabhakaracharyulu, President of the Vaikhanasa Divya Siddhanta Vardhini Sabha Sri Raghava Deekshitulu, and Secretary Sri Srinivasa Deekshitulu participated and recalled the divine contributions made by these two great saints.

ఘనంగా శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు




వైఖానస అచార్యులు శ్రీ భృగు మహర్షి, శ్రీ శ్రీనివాస మఖి తిరునక్షత్రోత్సవాలు బుధవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగాయి.

తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధినీ సభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వైఖానస ఆగమ పండితులు శ్రీ ప్రభాకరాచార్యులు, వైఖానస దివ్య సిద్ధాంత వర్ధనీ సభ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు, కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు పాల్గొని ఆ ఇద్దరు మహానుభావులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

మే 12న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం




మే 12వ తేదీ చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజ స్వామి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరుగనుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్‌ తదితర తొమ్మిది మంది దేవేరులు ఉదయం 6 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు.

అనంతరం అక్కడ ఉదయం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవారు వాహన మండపానికి వేంచేస్తారు. అక్కడ సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.
గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడినుండి గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 8.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.

Sri Govindaraja Swamy Ponnakalva Utsavam on 12th May




On May 12, Sri Ponnakalva Utsavam will be observed in Sri Govindaraja Swamy temple.

Sri Govindaraja Swamy will be flanked by Sridevi and Bhudevi will be taken to Ponnakalva located in Tanapalle road. 
Sri Krishna Swamy, Andal and Chakrattalwar will also be taken in the procession.
Later Snapanam will be performed here. From there Sri Govindaraja will reach Tiruchanoor before returning to Govindaraja Swamy temple.

TTD Chairman Offers Pattu Vastrams to Simhachalam Appanna




TTD Chairman Sri B.R. Naidu offered Pattu vastrams to Sri Varaha Lakshmi Narasimha Swamy (Appanna) at the Simhachalam temple near Visakhapatnam on Wednesday.

Since 1996, TTD has been offering these clothes every year during the Chandanotsavam festival. Simhachalam is one of the oldest Narasimha temples in India, and the idol here is believed to be self-manifested.
The Chandanotsavam festival began in the early hours. The idol is usually covered with sandalwood paste throughout the year. Only on the auspicious day of Akshaya Tritiya, the sandal paste is removed for 12 hours so that the devotees can see the presiding deity in Nija Rupa(original form) clearly. Then, a fresh layer of sandal paste is applied again.
On this special day, TTD offered the vastrams on behalf of Sri Venkateswara Swamy temple. 
TTD Dy EO Sri Lokanatham, Bokkasam In-charge Sri Guru Raja Swamy, and other officials were also present.

సింహాచలం అప్పన్నకు టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాల సమర్పణ





ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం సమీపంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి(అప్పన్న) టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

టీటీడీ 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తరుపున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదని, స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు.
సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయతృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతి ఏటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురు రాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.