భక్తి ఉద్యమంతో సంఘాన్ని సంస్కరించిన మహనీయుడు రామానుజాచార్యులు :- టీటీడీ తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి
భక్తి ఉద్యమంతో సమానత్వాన్ని బోధించి సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు భగవద్ రామానుజాచార్యులని టిటిడి తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
