15.5.25

అన్నమయ్య సంకీర్తనలతో ప‌ర‌బ్ర‌హ్మ ద‌ర్శ‌నం : ఆచార్య చెన్న‌ప్ప‌ annamacharya








 అన్న‌మ‌య్య అక్ష‌ర స‌ర‌స్వ‌తిని అశ్ర‌యించి త‌న సంకీర్త‌న‌ల‌తో సామాన్యుల‌కు ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపాన్ని చూచిన అనుభూతి క‌ల్పించార‌ని హైద‌రాబాద్ ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం విశ్రాంత ఆచార్యులు ఆచార్య చెన్న‌ప్ప పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు బుధ‌వారం నాలుగ‌వ‌ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్య‌క్ష‌త వ‌హించిన ఆచార్య చెన్న‌ప్ప‌ " అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు - బ్ర‌హ్మ‌సాక్షాత్కారం " అనే అంశంపై ఉపన్యసిస్తూ, ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని చెప్పారు. భ‌గ‌వంతుని చేర‌డానికి భక్తి సుల‌భ‌మైనదన్నారు. వ్ర‌తాలు, య‌గ్న‌యాగాలు త‌దిత‌ర‌వాటికి నియమాలు ఉంటాయ‌ని, కానీ భ‌క్తికి ఎలాంటి నియ‌మం ఉండ‌వ‌ని తెలిపారు. భగవంతుని ప్రేమతో, భ‌యంతో, స్నేహంతో, కోపంతో, ఎన్ని విధాలుగా ఆరాధించినా చేరుకోవచ్చని వివరించారు.
తిరుప‌తికి చెందిన విశ్రాంత ఆకాశ‌వాణి సంచాల‌కులు శ్రీ మ‌ల్లేశ్వ‌ర‌రావు " అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల్లో సామాజిక సందేశం " అనే అంశంపై మాట్లాడుతూ, క‌వి కూడా స‌మాజంలో భాగ‌మేన‌ని, స‌మాజాన్ని వ‌దిలి సాహితీ ర‌చ‌న ఉండ‌ద‌ని చెప్పారు. అప్ప‌టి స‌మాజంలోని అనేక రుగ్మ‌త‌ల‌ను బాహాటంగా విమ‌ర్శించి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు చూర‌గొన్న ప్ర‌జాక‌వి, అభ్యుద‌య క‌వి, సంఘ‌సంస్క‌ర్త అన్నమ‌య్య అన్నారు.
న‌గ‌రి ప్ర‌భుత్వ డిగ్రీ మ‌రియు పిజి క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ " అన్న‌మ‌య్య - తాత్త్విక‌త‌ " అనే అంశంపై ఉపన్యస్తూ, వైరాగ్యం, విరక్తి, కోర్కేలు లేక‌ పోవడం వంటి వాటిని ప్ర‌భోదిస్తూ, ప్ర‌జ‌ల‌ను ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో న‌డేపేందుకు అన్న‌మ‌య్య సంకీర్తనను రచించిట్లు తెలిపారు. వేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. నామ సంకీర్తన, నామ జపంతో జాతి, కుల, మతాలకతీతంగా భగవంతుని చేరవచ్చ‌ని తెలిపారు. శ్రీవారిని సంకీర్తన ద్వారా సామాన్యులకు చేరువ చేసేందుకు అన్నమయ్య కృషి చేసినట్లు వివరించారు.
సాయంత్రం 6 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి సుశీల‌ బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ శ్రీ‌నివాస్ బృందం హ‌రిక‌థ గానం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.
మ‌హ‌తి క‌ళా క్షేత్రంలో సాయంత్రం 6 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన కుమారి అనూష‌, కుమారి ఆర్తి బృందం సంగీత స‌భ‌, రాత్రి 7 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి అన్న‌పూర్ణ గాత్ర సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ మేడసాని మోహన్, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి లత, పెద్ద సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.

Annamacharya Sankeertans Reflected Social Issues of His Times- Scholars





The Annamacharya Sankeertans reflected the social issues prevailed during his times, said scholars.


The literary fete organised by TTD on the occasion of the 617th Birth Anniversary of Saint Poet Sri Tallapaka Annamacharya entered fourth day on Wednesday at Annamacharya Kalamandiram in Tirupati.

Renowned scholars including Acharya Chennappa, Sri Malleswara Rao, Smt Varalakshmi spoke on the occasion on various topics viz. Annamacharya Sankeertans -Brahma Sakshatkaram, Annamacharya Sankeertans -Social Message, Annamayya Philosophy respectively.

In the evening devotional cultural programmes were organised at Annamacharya Kalamandiram as well in Mahati Auditorium.

Annamacharya Project Director Dr Medasani Mohan, Program Assistant Smt Lata, literature lovers were also present.

స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు - టిటిడి ఛైర్మెన్ శ్రీ బీ ఆర్ నాయుడు-medical services








తిరుపతి స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్యసేవలు అందిస్తామని టిటిడి చైర్మెన్ శ్రీ బీ ఆర్ నాయుడు తెలిపారు. టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు అద్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ స్విమ్స్ లో మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు గత మూడు నెలల నుండి మాజీ టిటిడి ఈవో శ్రీ ఐవి సుబ్బరావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్ ఫర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు. ఈ నివేదికలో మౌళిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ పనులు, మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలు, నిధుల సేకరణ తదితర అంశాలపై నివేదిక సమర్పించిందన్నారు. ఎక్స్ ఫర్ట్ కమిటీ నివేదికపై టిటిడి బోర్డులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్విమ్స్ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తున్న ఎక్స్ ఫర్ట్ కమిటీ ఛైర్మెన్ డా. ఐ.వి. సుబ్బారావు, ఇతర సభ్యులను టిటిడి ఛైర్మెన్ కోరారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు మాట్లాడుతూ, స్విమ్స్ చాలా ప్రతిష్టాకమైనదని, 2021లో టిటిడిలోకి స్విమ్స్ ను అప్పగించారని, స్విమ్స్ కి టిటిడి నుండి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, సంవత్సరానికి రూ. 60 కోట్ల గ్రాంట్ తో పాటు ఎంప్లాయ్ హెల్క్ స్కీం, ప్రాణదాన ట్రస్ట్ , వివిధ రకాల ట్రస్ట్ ల ద్వారా సుమారు రూ. 100 కోట్లుకు పైగా సపోర్ట్ చేస్తున్నామని అన్నారు. స్విమ్స్ అనేది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడిందని, సంవత్సరానికి 18,000 సర్జనీలు, దాదాపు 4. 50 లక్షలుకు పైగా ఔట్ పేసెంట్లు, 47 వేల ఇన్ పేసెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని, ఇందులో పేదలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. స్విమ్స్ లో భవిష్యత్ తరాలకు సరిపడేలా ప్లాన్ ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంకాలజీ , చిన్న పిల్లల హెల్త్ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు, అంకాలజీని లెవన్ వన్ సెక్టార్ గా తీసుకెళ్లేందుకు , స్విమ్స్ లో ఫ్యాకల్టీ సమస్య, మానవ వనరులు, మౌళిక సదుపాయాల కల్పన, నిర్మాణాలు, నిధుల సమీకరణ, స్వచ్ఛంగా వచ్చే నిపుణులైన వైద్యుల సేవలు తదితర అంశాలు, సమస్యల పరిష్కారం కేసం ఎక్స్ ఫర్ట్ కమిటీ వేశారని, ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై జనరల్ కౌన్సిల్ చర్చించామన్నారు.
అంతకుముందు టిటిడికి అనుబంధంగా ఉన్న స్విమ్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మితమవుతున్న క్యాన్సర్ భవానాన్ని టిటిడి ఛైర్మెన్ పరిశీలించారు. 391 పడకలు గల నూతన క్యాన్సర్ భవనాన్ని, అందులోని 5 ఆపరేషన్ థియేటర్లను, పరికరాలను పరిశీలించారు. స్విమ్స్ కార్డియో థొరాసిక్ విభాగంలో శస్త్ర విభాగంలో చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన అన్నాభాయ్ (24 సంవత్సరాలు), ప్రకాశం జిల్లా రామాయపాలెం గ్రామానికి చెందిన బి. బన్సికా (2 సంవత్సరాలు) ఆరోగ్యం, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కలిగిరి, కడప జిల్లా ఓబుళవారిపల్లి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ ఫర్ట్ కమిటీ ఛైర్మన్ డా.ఐ.వి.సుబ్బారావు, సభ్యులు డా. జెఎస్ఎన్ మూర్తి, శ్రీ తేజోమూర్తుల రామోజీ, డా. చెన్నంశెట్టి విజయ్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, టిటిడి బోర్డు మెంబర్ శ్రీ ఎన్. సదాశివరావు, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మోం, సీఈ శ్రీ సత్యనారాయణ హాజరుకాగా వర్చువల్ గా హెల్త్ స్పెషల్ సిఎస్ శ్రీ ఎం.టి. కృష్ణబాబు, టిటిడి బోర్డు మెంబర్ శ్రీమతి సుచిత్రా ఎల్లా, ఎండోమెంట్ సెక్రటరీ శ్రీ వినయ్ చంద్ తదితరులు హాజరయ్యారు. 

Enhanced Medical Services- TTD Chairman



















TTD Chairman Sri B R Naidu said enhanced medical services will be provided at the TTD-run SVIMS super speciality Hospital in Tirupati. 


The Governing Council meeting was held at the SVIMS conference hall under the chairmanship of TTD Chairman Sri B R Naidu on Wednesday.

Speaking on the occasion, the Chairman said that an Expert Committee formed under the chairmanship of former TTD EO Sri I.V. Subba Rao has studied and submitted a report. 

The report included on infrastructure, human resources, medical equipment, engineering works, services of medical experts to provide enhanced medical services, fund collection and other issues. 

The TTD board will discuss the report of the Expert Committee and make necessary amendments as per the decision of the state government. 

On this occasion, TTD EO Sri J. Syamala Rao said SVIMS is a prestigious medical institution, which was handed over to TTD in 2021.

TTD is providing full support and a Rs. 60 crore grant per year, along with Employee Health Scheme, Pranadana Trust and various types of trusts, to the tune of over Rs. 100 crore. 

He said that SWIMS was established to provide better medical services to the poor people, and 18,000 surgeons, more than 4.50 lakh outpatients and 47 thousand inpatients are receiving medical services every year, of which the poor are the majority.  

He said that new buildings are being constructed in SVIMS as per the plan to suit future generations, and constructions are being made for Oncology and child health care.

In order to take oncology as a numero uno sector, an Expert Committee has been formed to solve the problems of faculty, human resources, infrastructure, construction, fund-raising, services of expert doctors and many more in SVIMS, and the report given by this committee was discussed by the General Council. 

Earlier, the TTD Chairman inspected the cancer building being constructed with state-of-the-art medical equipment in SVIMS, which is affiliated to TTD. 

The new cancer building with 391 beds, its 05 operation theaters and equipment were inspected. 

He later interacted with Annabhai (24 years old) from Kurnool district, Mantralayam, who is undergoing treatment in the surgical department in the cardiothoracic department, B.  Bansika (2 years) and inquired about the health and medical services being provided. 

The TTD Board Chief also inquired about the medical services being provided to the patients who came from Kaligiri in Nellore district, Obulavaripalli in Kadapa district, Palasamudram in Chittoor district, and Sri Kala Hasti in Tirupati district.

Besides the Expert Committee Chairman Sri I. V. Subbarao, Members Dr. J. S. N. Murthy, Sri Tejomoorthula Ramoji, Dr. Chennamsetty Vijay Kumar, SVIMS Director Dr. R. V. Kumar, TTD Board Member Sri N. Sadashivarao, JEO Sri V. Veerabrahmam, CE Sri Satyanarayana were also present.

While Health Special CS Sri M. T. Krishnababu, TTD Board Member Smt. Suchitra Ella, Endowment Secretary Sri Vinay Chand and others participated virtually. 

మే 17 నుండి 19వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు - మే 18న స్వర్ణ రథోత్సవం=skvst




శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 17 నుండి 19వ తేదీ వరకు జరుగనున్నాయి.

మే 18న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
ఉత్సవర్ల‌ను ఆలయంలోని వసంత మండపానికి వేంచేపు చేసి ప్రతి రోజు మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతాలక్ష్మణ ఆంజ‌నేయ‌స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకొచ్చి శాస్త్రోక్తంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆస్థానం నిర్వహిస్తారు.
వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం అని అర్చ‌కులు తెలిపారు.
ఈ సందర్భంగా మే 17 నుండి 19వ తేదీ వరకు ఆలయంలో కల్యాణోత్సవం ఆర్ధిత సేవను టిటిడి రద్దు చేసింది.

Vasantotsavams in SKVST




The annual Vasanthotsavams in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram will be observed from May 17-19.


On May 18 there will be a procession of the Golden Chariot.

Every day Snapana Tirumanjanam is performed to the Utsava deities from 2pm to 4pm.

Owing to this festival, TTD has cancelled Arjita Kalyanotsavam during these three days.

14.5.25

చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' బ్లాక్ బస్టర్ హిట్ రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్







చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ తో ప్రారంభించారు.


"జై శ్రీ రామ్" అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో 25+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అన్ని మ్యూజిక్ చార్ట్స్ లో టాప్  ట్రెండింగ్ కొనసాగుతూ బ్లాక్ బస్టర్ హిట్ గా అదరగొడుతోంది.

సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. 
చిరంజీవి డాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, మ్యాసీవ్ సెట్.. ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రానున్న రోజుల్లో ఈ సాంగ్ మరింత పెద్ద హిట్ కాబోతోంది.

తన బ్లాక్‌బస్టర్ ఫస్ట్ మూవీ బింబిసారతో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ట, విశ్వంభర ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రీం ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. మ్యూజికల్ జీనియస్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్.

తారాగణం: 


చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్


సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో