2.6.25

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ Ankurarpanam







తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం 5.30 - 8.00 గం.ల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు.  ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.

జూన్ 02న ధ్వజారోహణం :

శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన జూన్ 02న సోమవారం ఉదయం 07.02 -  07.20 గం.లకు మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు.

ఆలయ నేపథ్యం - శ్రీగోవిందరాజస్వామి వారి ఐశ్వర్యాభివృద్ధి కొరకు వారి యొక్క దక్షిణ పార్శ్వమునందు ఒక గుడిలో ఆండాళ్ అను గోదాదేవిని కూడా ప్రతిష్ట చేయించిరి. దేశాధిపతియగు యాదవ భూపాలుడు ఈ ఆలయ ప్రాంతమునకు "రామానుజపురం" అని నామ ధేయముంచి, శ్రీరామానుజాచార్యులవారి దివ్యాజ్ఞ మేరకు, శ్రీ గోవిందరాజ స్వామి వారికి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి వలె, నిత్యోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులను చేయుచుండెను. తదుపరి నాటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉత్సవాలను క్రమంగా నిర్వహిస్తున్నారు. శ్రీగోవిందరాజస్వామి వారి ప్రాంగణంలో శ్రీ పార్థసారధిస్వామి వారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పుండరీకవల్లి (మహాలక్ష్మి) అమ్మవారు, సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధి, భగవద్రామానుజులవారి సన్నిధి, తిరుమలనంబి, అనంతాళ్వారులు, ఆళ్వార్ల సన్నిధులు మున్నగు ఉప ఆలయాలు చోటు చేసుకున్నవి. అందువల్లే ఆలయాల సముదాయంగా శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయం ప్రధానంగా వెలిసి యున్నది.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. 

వాహన సేవలు వివరాలు: 

 02వ తేదీ  రాత్రి 07 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.

03.06. 2025 - ఉ. – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
04.06. 2025 - ఉ. - ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం
05.06. 2025 - ఉ. – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం
06.06. 2025 - ఉ. – మోహినీ అవతారం, రాత్రి – గరుడ వాహనం
07.06. 2025 - ఉ. – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనం
08.06. 2025 - ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
09.06. 2025 - ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
10.06. 2025 - ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ కె. ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ లు శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ రావు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ankurarpanam Held












Ankurarpanam for Sri Govindaraja Swamy Brahmotsavams was performed on Sunday evening in the temple in Tirupati.

The Dhwajarohanam will be observed between 07:02 am and 7:20am in the auspicious Mithuna Lagnam on June 02.

Both the Pontiffs of Tirumala, temple officials, were present.

1.6.25

Bhiravam Movie Success meet






































 

Admissions Open from2nd June for SV Collegeof Music, Dance and Nadaswaram School




Applications are invited from eligible students for admission into various courses for the academic year 2025–26 at Sri Venkateswara College of Music and Dance and SV Nadaswaram & Dolu School, located in Tirupati, starting from June 2.

The college offers full-time, Visharada (Diploma), and Praveena (Advanced Diploma) courses in Vocal, Veena, Flute, Violin, Nadaswaram, Dolu, Bharatanatyam, Kuchipudi, Dance, Harikatha, Mridangam, Ghatam.
SV Nadaswaram and Dolu School offers Full-time Certificate and Diploma courses. Classes will commence from June 27. Hostel facilities will be provided for students coming from other regions.
Interested candidates can obtain the application form during college working hours by submitting a Demand Draft (DD) of ₹50 in the name of EO, TTD.
Eligibility For regular courses:8th standard Pass, Evening courses: 5th standard Pass
For more details, contact the following numbers during working hours of the college:9440793205, 9848374408.

జూన్ 06 నుండి 15వ తేదీ వ‌రకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు Appalayagunta Temple




అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 06 నుండి 15వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 03వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్ 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

 
07-06-2025   ధ్వజారోహణం -                      పెద్దశేష వాహనం
 
08-06-2025   చిన్నశేష వాహనం,               హంస వాహనం
 
09-06-2025    సింహ వాహనం,                     ముత్యపుపందిరి వాహనం
 
10-06-2025   కల్పవృక్ష వాహనం,              శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం,               సర్వభూపాల వాహనం
 
11-06-2025   మోహినీ అవతారం,                గరుడ వాహనం
 
12-06-2025  హనుమంత వాహనం,             గజ వాహనం
 
13-06-2025    సూర్యప్రభ వాహనం,             చంద్రప్రభ వాహనం
 
14-06-2025    రథోత్సవం,                                అశ్వవాహనం
 
07-06-2025    చక్రస్నానం ,                              ధ్వజావరోహణం

ఆలయ విశిష్టత : సుమారు వేయి ఏళ్లుకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న కార్వేటినగర ప్రభువుల పాలనలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి అప్పలాయగుంట ఆలయం ఉండినట్లు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయ ఉత్సవాలు, ఊరేగింపుల తరహాలో అప్పలాయగుంట ఆలయమునందు కూడా కార్వేటినగర ప్రభువులు ప్రధానపాత్ర పోషించి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. 

స్థల పురాణం: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలలోని వకుళామాత ఆశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో శ్రీ సిద్దేశ్వర స్వామి వారి తపస్సును మెచ్చి, ఆయన కోరిక మేరకు ప్రసన్నుడై అక్కడ అభయ హస్తముతో వెలసినట్లు తెలియుచున్నది. 

ఈ ఆలయం తూర్పు ముఖముగా నిర్మింపబడి, గర్భాలయం నందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి మూలమూర్తి చతుర్బుజుడై శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం మరియు అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటూ శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, బాష్యకారుల ఉత్సవ విగ్రహాలు కలిగియున్నారు. గర్భాలయానికి నైరుతిమూలలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయము, వాయువ్యమూలలో శ్రీగోదాలక్ష్మీ అమ్మవారి ఆలయం స్వామివారికి అభిముఖముగా గరుత్మంతుల వారి విగ్రహము వెలసియున్నది. ఆలయ వెలుపలి ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది.
 
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 10వ తేదీ సాయంత్రం 4.30 - 6.30 గంటల మధ్య స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
 
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Appalayagunta Brahmotsvams




The annual Brahmotsavams in Appalayagunta will be conducted by TTD from June 6 to June 15.


Koil Alwar Tirumanjanam will be held on June 3 while Ankurarpanam on June 6. The important days includes Kalyanotsavam on June 10, Garuda Vahanam on June 11, Rathotsavam on June 14 and Chakra Snanam on June 15.

The Grihastas participating in Kalyanam have to pay Rs.500 on which two persons will be allowed. The Kalyanam will be held between 4.30pm and 6.30pm.

Everyday in the morning the Vahana sevas takes place between 8am and 9am while in the evening between 7pm and 8pm.

The devotional cultural programmes by HDPP, Annamacharya and Dasa Sahitya projects are arranged everyday.