3.6.25

విద్యార్థులలో మానవ విలువలను పెంపొందించే వినూత్న కార్యక్రమం ''సద్గమయ'' TTD MULLS SADGAMA

దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులలో హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను





పెంపొందించే లక్ష్యంతో టీటీడీ త్వరలో సద్గమయ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోనిసమావేశ మందిరంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సోమవారం ఈ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా నిర్వహించారు.
విద్యార్థులలో సహనం, సానుభూతి, నిజాయితీ, కరుణ, విశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ వంటి అంశాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అంశాలను 
శిక్షణ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన ఆదేశించారు.
ముందుగా హెచ్ డి పీపీ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ప్రధాన అంశాలను వివరించారు. విద్యార్థులలో నైతికత, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, నైపుణ్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ప్రేమ- ఆప్యాయత- కృతజ్ఞత, కరుణ, సమగ్రతలను పెంపొందించడం ద్వారా విద్యార్థులను దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని వివరించారు. ఈ కార్యక్రమం మొదటగా టిటిడి పాఠశాలల విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ రాజ గోపాల్, ఎస్ ఈ శ్రీ మనోహరం, డిఈవో శ్రీ వెంకట సునీల్, వీజీవో శ్రీమతి సదా లక్ష్మి, సిఎంవో డాక్టర్ నర్మద, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, డిఈ ఎలక్ట్రికల్ శ్రీమతి సరస్వతి, ఎస్వీబీసీ ఓఎస్డీ శ్రీమతి పద్మావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

TTD Mulls Sadgama - An Innovative Programme Aimed at Incucating Human Values Among Students







With an aim to inculcate ethical values taught by Hindu Sanatana Dharma among the students who are the future pillars of the nation, TTD has mulled an innovative programme, Sadgamaya-a path towards righteousness which will be implemented soon.


In connection with this, a review meeting was held by the TTD JEO Sri Veerabrahmam in the Conference Hall of TTD Administrative Building in Tirupati on Monday.

TTD JEO Sri Veerabrahmam instructed the concerned that the programme should be developed in such a way that it should enhance the spirit of tolerance, empathy, honesty, compassion, confidence, self-discipline among the students. He also directed that the training schedule should include group activities, community service and many more.

Earlier, the HDPP Secretary Sri Sriram Raghunath explained the JEO the intention behind the programme through a Power Point Presentation stating that the progamme aims at laying a strong moral foundation among the students, in their character development, fostering social and emotional skills, love-affection-gratitude towards parents and teachers, compassion, integrity and thereby making the students the true and responsible citizens of the country. He said the programme will commence with the students of TTD schools initially.

All Projects Special Officer Sri Raja Gopal, SE Sri Manoharam, DEO Sri Venkata Sunil, VGO Smt Sada lakshmi, CMO Dr Narmada, Additional HO Dr Sunil, DE Electrical Smt Saraswati, OSD SVBC Smt Padmavati and other officers were also present.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

విజయవాడకు చెందిన డాక్టర్ సాత్విక టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. 




ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు.

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం





తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 07.02 - 07.20 గంటల మద్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.

అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
బ్రహ్మోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు:
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్ తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా జూన్ 06న గరుడ వాహనం, జూన్ 09న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు(ఎల్ఇడి)లు ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 07 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
పెద్ద శేష వాహనం విశిష్టత:
పెద్ద శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి 'శేషశాయి' అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి , ఏఈవో శ్రీ కె.మునికృష్ణారెడ్డి , శ్రీవారి సేవకులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Dhwajarohanam Held for Sri Govindaraja Swamy Vari Temple Fete









The annual brahmotsavams off to a religious and colourful start in the most famous and ancient temple of Sri Govindaraja Swamy in Tirupati on Monday with the ceremonious Dhwajarohanam.


The celestial flag bearing the image of Garudalwar was hoisted on the top the temple mast in the auspicious Mithuna lagnam between 7.02am and 7.20am amidst chanting of Vedic mantras as per the tenets of Vaikhanasa Agama.

Later in the morning between 10am and 11am the Snapana Tirumanjanam has been carried out to the Utsava deities.

Both the seers of Tirumala, DyEO Smt VR Shanti, AEO Sri Munikrishna Reddy and other temple staff, devotees were present.

Pedda Sesha Vahanam Held














On the first day evening of the ongoing annual Brahmotsavam in Sri Govindaraja Swamy temple in Tirupati, Pedda Sesha Vahana seva was held on Monday evening.


Sri Bhu sameta Sri Govindaraja took out a celestial ride on the seven hooded Pedda Sesha Vahanam to bless His devotees.

Both the seers of Tirumala, JEO Sri Veerabrahmam, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others were present.

2.6.25

Telangana State Formation Day Celebrations held at Parade Grounds-02