The annual Teppotsavams in Sri Padmavati Ammavaru temple in Tiruchanoor will be from June 07-11.
The five day float festival will be organized between 7:30pm and 8:30pm.
On the first evening, Rukmini Satyabhama sameta Sri Krishna, Second day Sri Sundara Raja Swamy, on the last three days Sri Padmavati Devi takes a celestial ride on the finely decked float to bless the devotees.
TTD has cancelled Kalyanotsavam and Unjal Seva in connection with this festival.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 07 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి.
ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.
జూన్ 07వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు.
తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ 07వ తేదీ రాత్రి 7.30 - 8.30 గం.ల మధ్య శ్రీకృష్ణ స్వామివారు, జూన్ 08వ తేదీన శ్రీ సుందరరాజస్వామి వారు, జూన్ 09వ తేదీన శ్రీ పద్మావతీ అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించనున్నారు.
జూన్ 10వ తేదీ రాత్రి 8.30 - 10.00 గం.ల మధ్య గజ వాహనంపై, 11 తేదీ రాత్రి 8.30 - 10.00 గం.ల వరకు గరుడ వాహనంపై అమ్మవారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
In view of World Environment Day on Thursday, June 05, TTD has organized a plantation program in Tirumala near Gogarbham Circle.
TTD Additional EO Sri Ch Venkaiah Chowdary who graced the occasion planted Ficus bengalensis(Banyan-Marri) in the premises of the Octopus Building.
Speaking on the occasion he said, on the occasion of World Environment Day, TTD is planting two thousand saplings in Tirumala.
We have taken steps to increase greenery in Tirumala by 80 percent and soon organize a program to plant two lakh saplings along with the Forest department.
Deputy CF of TTD Sri Srinivas, DyEO Health Sri Somannarayana, FRO Sri Doraswamy, Health officer Sri Madhusudhan, EE Sri Sudhakar and officers have also planted samplings on the occasion.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పచ్చదనాన్ని 80 శాతం పెంచేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నప్పటికీ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పగడ్భందీగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.
భక్తులు వాహనాల ద్వారా తీసుకొస్తున్న ప్లాస్టిక్ ను కారు విండోల ద్వారా ఘాట్ రోడ్లలో విసురుతున్నారని, దీని ద్వారా ప్లాస్టిక్ అధికంగా పేరుకుపోతుండటంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్లాస్టిక్ ను నియంత్రిస్తున్నామన్నారు. భక్తులకు కూడా వాహనాల్లో నుండి రోడ్డుపై ప్లాస్టిక్ విసరకూడదని అవగాహన కల్పిస్తున్నామన్నారు.
తిరుమలలో ప్రతి చెట్టుకు ప్రాధన్యత ఉందని, విదేశీ మొక్కలు నాటడం ద్వారా స్వదేశీ చెట్లకు హాని కలుగుతుందని చెప్పారు. అందులో భాగంగా పూర్తిస్థాయిలో పరిశోధన చేసి 40 స్థానిక మొక్క జాతులు ను గుర్తించి తిరుమలలో నాటుతున్నామని చెప్పారు. త్వరలో అటవీశాఖ సహకారంతో రెండు లక్షల మొక్కలను నాటుతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఈ ఈ శ్రీ సుధాకర్, ఎఫ్వార్వో శ్రీ దొరస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
K.V. Muralikrishna assumed charge as the Chief Vigilance and Security Officer (CV&SO) of TTD at the Sri Venkateswara Swamy Temple in Tirumala on Thursday.
Before taking charge, the CV&SO had darshan of Sri Venkateswara Swamy and then formally took charge at the Ranganayakula Mandapam. The temple officials presented him with Tirtha Prasadams.
TTD Additional CV&SO Sri Venkata Shivakumar Reddy, Vigilance Officers Sri Ram Kumar, Sri Surendra, and other officials participated in the program.
టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతాధికారిగా శ్రీ కే.వీ.మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ముందుగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీవీఎస్వో రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సీవీఎస్వోకు తీర్థ ప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సీవీఎస్వో శ్రీ వెంకట శివకుమార్ రెడ్డి, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 గంటల నుండి వాహనసేవ వైభవంగా సాగింది. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు ఈడేర్చే కోనేటిరాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు.
అనంతరం ఉదయం 10.00 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.00 వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామి కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకుల అధికారి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు.
జూన్ 06న గరుడసేవ :
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 7 నుండి 10 గంటల వరకు గరుడసేవ వైభవంగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయంగార్లు, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి పలువురు అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.