10.6.25
చంద్రప్రభ వాహనంపై వెన్న కృష్ణుడి అలంకారంలో శ్రీగోవిందరాజ స్వామి ChandraPrabha Vahanam
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి 7.30 గంటలకు గోవిందరాజస్వామివారు చంద్రప్రభ వాహనంపై వెన్న కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తాడు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
జూన్ 09న రథోత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.15 గంటల నుండి రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
Sri Sundararaja Swamy Rides the Float
On the second day of the annual Teppotsavam at Sri Padmavathi Ammavari Temple, which fell on Sunday, Sri Sundararaja Swamy took three majestic rounds on the float in Padmasarovaram, blessing devotees.
The day began with Suprabhatam, followed by Sahasranama Archana and Nitya Archana. From 3 PM to 4.30 PM, a grand abhishekam was performed using milk, curd, honey, sandal, and aromatic substances.
At 6.30 PM, the deities were brought to Padma Pushkarini, and the float festival took place from 6.30 to 7.15 PM. Later, Swamy was taken on a procession along the four Mada streets.
Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Chalapathi, other officials, priests, Srivari Sevaks, and a large number of devotees participated.
రెండవ రోజు తెప్పపై విహరించిన శ్రీసుందరరాజ స్వామి Float Festival
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఆదివారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజ స్వామి వారు
తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 03.00 నుండి 4.30 గంటల వరకు స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ సుందరరాజ స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భక్తజన సంమోహనం మధ్య వైభవంగా గోవిందుడి రథోత్సవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదే.
అనంతరం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, నమ్మాళ్వార్ల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రథోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, ఎస్ ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర ఇంజినీరింగ్ పలుశాఖల అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జూన్ 10న చక్రస్నానం :
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 10న మంగళ వారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు (ఆళ్వార్ తీర్థం నందు) స్నపన తిరుమంజనం, చక్రస్నానం వైభవంగా జరుగనుంది. సా. 4.30 గంటలకు స్వామి, అమ్మవార్లు బంగారు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకీలో ఊరేగింపుగా పిఆర్.తోట నుండి సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు.
రాత్రి 07.00 గం.లకు శ్రీవారు ఉభయ నాంచారులతో బంగారు తిరుచ్చినందు చక్రత్తాళ్వార్ లతో నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు జరుగనుంది. అనంతరం రాత్రి 8.40 - 9.30 గం.ల మధ్య ధ్వజారోహణం మరియు ఆస్థానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
9.6.25
Jyestabhishekam Commences
The annual Jyestabhishekam commenced on a grand religious note in Tirumala temple on Monday.
In the morning, Snapana Tirumanjanam was performed to the Utsavam deities while in the evening, the precious diamond-studded armour was adorned to Sri Malayappa Swamy.
Later the utsava deities blessed the devotees in the Vajra Kavacha which happens once in a year.
TTD Addl EO Sri C.H. Venkayya Chowdhury, DyEO Sri Lokanatham and others were present.
Social Media Video That A Man Consumed in Tirumala is Untrue
It has come to the notice of TTD that a video circulating on social media platforms recently shows a man consuming alcohol and is spreading rumors, describing it as having taken place in Tirumala. is completely untrue.
The alleged incident took place at the beginning of Alipiri, i.e. before reaching the check post and that area does not fall within the Tirumala.
However, some individuals are involved in spreading false propaganda that there has been corruption in Tirumala with all their mis propaganda.
In this context, TTD appeals to devotees not to believe in such false propaganda or else that legal action will be taken against those who spread lies that damage the sanctity of Tirumala.
Subscribe to:
Comments
(
Atom
)

































