11.6.25

Teppotsvam at Tiruchanoor







On Tuesday, the fourth day of the annual Teppotsavam, Sri Padmavathi Ammavaru blessed devotees with a divine float ride in Padma Pushkarini and a procession on Gaja Vahanam through Tiruchanoor’s Mada streets. 


The day included Suprabhata Seva, Sahasranamarchana, Nityaarchana, and a grand Abhishekam from 3 PM to 4.30 PM. The Teppotsavam was held from 6.30 PM to 7.15 PM.

Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Sri Ramesh, and devotees participated.

నాలుగవ రోజు తెప్పపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు గజ వాహనం పై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు Teppotsavam












తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మంగళవారం పద్మ సరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు 

తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 03.00 నుండి 4.30 గంటల వరకు స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది.
గజవాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారు:
అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గజ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సర్వభూపాల వాహనంపై అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు sarvabhoopala Vahanam





అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 - 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 04.00 - 4.30 గం.ల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వేంచేపు చేశారు. సాయంత్రం 4.30 - 6.30 గం.ల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహించారు.
శుక్రవారం ఉదయం 8 గం.లకు పల్లకీలో మోహినీ అవతారంలో స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
జూన్ 11న గరుడ సేవ
శుక్రవారం రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Sarvabhoopala Vahanam Held








As a part of the ongoing annual Brahmotsavams in Appalayagunta, Sarvabhoopala Vahanam is held on Tuesday evening.

Earlier in the evening, arjita Kalyanotsavam was held.

Deputy EO Sri Hareendranath, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani and others were present.

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప



 





తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు.

అంతకుముందు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.
సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

Malayappa Shines in Pearl Armour

The annual Jyestabhishekam entered the second day on Tuesday in Tirumala temple.











In the morning, Snapana Tirumanjanam was performed to the Utsavam deities while in the evening the Mutyapu Kavacham was adorned to Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi.

Later the utsava deities blessed the devotees in the Mutyapu Kavacham.

HH Sri Pedda Jeeyar Swamy and HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, TTD Addl EO Sri C.H. Venkaiah Choudhary, DyEO Sri Lokanatham and others were present.

టిటిడి ఉద్యోగుల సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలి - టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు




శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగుల సమస్యలను నిర్దేశించన సమయంలో పరిష్కరించాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి పరిధిలోని ఉద్యోగుల సమస్యలను నిర్దేశించిన సమయంలోను, ప్రభుత్వ పరిధిలోని అంశాలపై వారితో చర్చించి అనుమతులు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపులోను, ఇతర అలవెన్స్ ల చెల్లింపులోను అలసత్వం లేకుండా పరిష్కరించాలని కోరారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జీఎన్బీ, ఎస్వీ పూర్ హోమ్, కే.టీ, వినాయకనగర్, రామనగర్ ప్రాంతాలలోని టిటిడి క్వార్టర్స్ లలో డ్రైనేజీ సమస్యలు, భవనాల లీకేజీలు, విద్యుత్ తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్ల స్థలాలపై వివిధ శాఖల అనుమతులు విషయంలో సీనియర్ అధికారులతో కమిటీ వేసుకుని పరిష్కరించాలని సూచించారు. సదరు ప్రాంతాలలో రోడ్లు, కాలువలు, ఇతర ఇంజనీరింగ్, మౌళిక సదుపాయాలపై టిటిడి ఉన్నతాధికారులు చర్చించాలన్నారు. దిగువ స్థాయిలో ఉద్యోగుల సమస్యలపై నిరంతరం సీనియర్ అధికారులు చర్చించి పరిష్కరించాలని, ప్రభుత్వ స్థాయిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని టిటిడి అధికారులను ఈవో కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సిఈ శ్రీ టివి సత్యనారాయణ, డిఎల్వో శ్రీ వరప్రసాద్ రావు, పలు శాఖల డిప్యూటీ ఈవోలు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.