20.6.25

క్రమం తప్పకుండా శాఖల వారీగా భక్తుల నుండి అభిప్రాయ సేకరణ - టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు






శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానములు అందిస్తున్న సేవలపై క్రమం తప్పకుండా అభిప్రాయ సేకరణ ప్రామాణికంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు తెలిపారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణపై వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వడ పంపిణీ, వసతి, కాలినడక భక్తులకు అందితున్న సేవలు, లగేజీ, కళ్యాణకట్ట, వైద్యం, పారిశుధ్యం, పరిశుభ్రత, విజిలెన్స్, ట్రాన్స్ ఫోర్ట్ తదితర అంశాలపై భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. శ్రీ మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాధ్యాసాద్యాలను పరిశీలించాలని అధికారులను సూచించారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఆలస్యం చేయకుండా క్రమపద్దతిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం, వంట సరుకుల నాణ్యత పరీక్షించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించి భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలను అందించాలని కోరారు.

వసతి గృహాలలో సకాలంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించేందుకు వీలుగా రిసెపక్షన్, ఐటీ విభాగాలు సమన్వయంతో ఎఫ్.ఎమ్. ఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భక్తుల రద్దీ సమయాలలో లడ్డూ కౌంటర్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా, ఆలస్యం చేయకుండా లడ్డూలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి తగ్గట్టుగా లడ్డూ కౌంటర్లలో సిబ్బందిని నియమించాలన్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతాలలో రవాణా వ్యవస్థ మీద విజిలెన్స్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నిఘాను మరింత పెంచాలని , కల్యాణకట్టలో విజిలెన్స్ విభాగం, కల్యాణకట్ట విభాగాలు మరింత సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని సూచించాలన్నారు. తిరుమలలో ఉచిత బస్సుల సేవలపై భక్తులకు తెలిసేలా ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, శ్రీవారి సేవకులను నియమించి అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి పరిపాలనా భవనం నుండి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళీ కృష్ణ, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Pontiff of Avadhoota Datta Peetham Mysore






His Holiness Parama Pujya Sri Ganapati Sachchidananda Swamiji
 of Datta Peetham, Mysore offered prayers to Lord Venkateswara Swamy inside Sri Vari Temple, Tirumala on Thursday morning. On his arrival at infront of Sri Vari Temple, TTD Addl EO Sri Venkaiah Chowdary and Temple priests of Sri Vari temple received his holiness with temple honours in front of the temple. 

 
DyEO Sri Lokanadham and others were also present.

తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పులు ప్రారంభించిన అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి Free RTC Buses







తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల ద్వారా ఉచిత స‌ర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం ఉద‌యం ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పుల‌ను ఆయ‌న జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సంద‌ర్భంగా ఆయ‌న తిరుమ‌ల‌లో ప్రైవేట్ వాహ‌నాలు భ‌క్తుల నుండి వ‌సూలు చేస్తున్న అధిక ఛార్జీల‌ను అరిక‌ట్ట‌డంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పాల‌ని ఏపీఎస్ ఆర్టీసీని కోరిన‌ట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వ‌రిత‌గ‌తిన బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావ‌డంతో కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాలు తిరిగే మార్గంలోనే ఈ బ‌స్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మ‌రో ప్రాంతానికి భ‌క్తుల‌ను ఉచితంగా చేర‌వేస్తాయ‌ని చెప్పారు.

ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు, ఆర్టీసీకి అద‌న‌పు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే టీటీడీ శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాల ద్వారా తిరుమ‌ల‌లో ప్ర‌తిరోజూ 300 ట్రిప్పుల‌ను తిప్పుతోంద‌ని చెప్పారు. ఆర్టీసీ బ‌స్సులు తోడ‌వ్వ‌డంతో అద‌నంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌తి రెండు నిమిషాల‌కు బ‌స్సులు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బ‌లోపేతమవ్వ‌డంతో పాటు బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చెప్పారు.

భ‌క్తులు బ‌స్టాండ్ వ‌ద్ద‌కు రాకుండా తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బ‌స్సులను ఎక్క‌డం ద్వారా నేరుగా తిరుప‌తికి వెళ్లేందుకు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో ఏ ప్రాంతంలో బ‌స్సు ఎక్కినా తిరుమ‌ల నుండి తిరుప‌తికి మాత్ర‌మే ఛార్జీలు ఉంటాయ‌ని, ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ స‌ర్వీసుల‌ను భ‌క్తులు వినియోగించుకోవాల‌ని ఆయ‌న భ‌క్తుల‌ను కోరారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ పైడి చంద్ర‌శేఖ‌ర్, టీటీడీ ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, తిరుప‌తి జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి శ్రీ వెంక‌ట‌రావు, డిప్యూటీ సీటీఎం శ్రీ విశ్వ‌నాథ్‌, డిప్యూటీ సీఎంఈ, శ్రీ బాలాజీ, అలిపిరి డిపో మేనేజ‌ర్ శ్రీ‌హ‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Conclusion of Sri Sundararaja Swamy Avatara Utsavams





The Avatara Utsavams of Sri Sundararaja Swamy, a sub-shrine of Tiruchanoor, Sri Padmavathi Ammavari Temple, concluded on Thursday, evening.


On the final day, Abhishekam to the Moolavarlu was conducted from 5.30 AM to 6.30 AM. Later from 3 PM to 4 PM, Abhishekam to the Utsava idols was performed at the Sri Krishnaswamy Mukha Mandapam, using milk, curd, honey, coconut water, turmeric, and sandal paste.

In the evening, Unjal Seva for the deity was held from 5.45 PM to 6.15 PM.

From 7 PM to 8.30 PM, Sri Sundararaja Swamy was taken for a procession on the Garuda Vahanam along the four Mada streets, blessing the devotees.

Temple officials, including Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Sri Ramesh, and Arjitham Inspector Sri Chalapathi, besides devotees participated in the event.

ముగిసిన‌ శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు Avatarotsavams








తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు గురువారం ముగిశాయి. జూన్ 17 నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌రిగాయి.

ఇందులోభాగంగా ఉదయం 5.30 - 6.30 గం.ల వరకు శ్రీ సుందరాజస్వామి వారి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 - 4.00 గం.ల మధ్య శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5.45 - 6.15 గం.ల వరకు శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించారు. రాత్రి 7.00 - 8.30 గం.ల వరకు నాలుగు మాడ వీధులలో శ్రీ సుందరరాజ స్వామి వారు గరుడ వాహనంపై విహరించి భక్తులకు అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆర్జితం ఇన్పెక్టర్ శ్రీ చలపతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Online E-Auction of Used Mobile Phones on 20th and 21st June




TTD will conduct an online e-auction on June 20 and 21 for 74 lots of used and partially damaged mobile phones that were offered by the devotees at Tirumala Temple and TTD sub-temples.


The mobile phones include brands like Karbonn, LYF, Nokia, Samsung, Lava, Intel, Lenovo, Philips, LG, Sansui, Oppo, Poco, Acer, Panasonic, Honor, OnePlus, BlackBerry, MI, Gionee, Microsoft, Asus, Coolpad, HTC, Motorola, Tecno, Infinix, Realme, Huawei, Celkon, Vivo, Micromax, and others. 

These phones will be auctioned under E-AID Nos. 25132, 25133, 25134, and 25135 in online mode.

Only bidders registered on the Andhra Pradesh Government’s e-Procurement portal are eligible to participate in the auction.

For further details, interested bidders may contact the General Manager (Auctions) or AEO (Auctions), TTD, at TTD Office, Hare Krishna Road, Tirupati, or visit: https://konugolu.ap.gov.inwww.tirumala.org or Phone: 0877-2264429.

జూన్ 20 నుండి 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్లు ఈ - వేలం




తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ - వేలం వేయనున్నారు.

కార్భన్ , ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్ మరియు మొబైల్ ఫోన్లు ఈఏఐడి నెం. 25132, 25133, 25134, 25135 ఆన్ లైన్ లో ఈ - వేలం వేయనున్నారు.
ఆసక్తి కల్గిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్( వేలంలు), / ఏఈవో ( వేలంలు), టిటిడి, హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugoluap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 - 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు.