తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు కోరారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులతో బుధవారం టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాాట్లాడుతూ, శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారని, వారికి సేవా దృక్పధంతో నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత, లాభాపేక్ష లేకుండా నిర్ధేశించిన ధరలకు అందించాలన్నారు. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23వ తేదీ నోటిఫిషన్ జారీ చేశారు. సదరు ఈవోఐ సంబంధించిన సందేహాలపై గుర్తింపు ఉన్న హోటళ్ల నిర్వాహకులు తమ ఆసక్తిని వ్యక్తం చేసేందుకు (EOI)/ ఫ్రీ బిడ్ మీటింగ్ ను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు, టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి నిర్వహించారు.
తిరుమలలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు, పరిశుభధ్రత పాటించాలని, లాభాపేక్ష లేకుండా నిర్దేశించిన ధరల ప్రకారం ఆహార పదార్ధాలను అందించాలని వారిని ఈవో, అదనపు ఈవో కోరారు. నిర్థారించిన నియమాలకు లోబడి బిగ్, జనతా క్యాంటిన్ లో కేటాయింపు ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు.
ఈ సమావేశంలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో టెండర్ ప్రాసెస్ మరియు తదితర నియమ నిబంధనలను గుర్తింపు, ఆసక్తి ఉన్న హోటళ్ల నిర్వాహకులు నివృత్తి చేసుకున్నారు. హోటళ్ల నిర్వాహకులు పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని టిటిడీ ఈవో, అదనపు ఈవో నివృత్తి చేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎఫ్.ఏ.ఓ శ్రీ రవి ప్రసాదు, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ కె. వెంకటేశ్వర్లు, ఆసక్తి , గుర్తింపు ఉన్న పలు హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది.
చారిత్రక నేపథ్యం :
సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఉత్సవ విశిష్టత :
ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ :
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామివారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.
పుష్ప పల్లకీపై ఊరేగింపు :
ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
ఆణివార ఆస్థానం కారణంగా జూలై 16న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
VIP బ్రేక్ దర్శనాలు రద్దు
జూలై 15 మరియు జూలై 16 తారీఖుల్లో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం మరియు ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా ఈ రెండు రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలు జూలై 14 మరియు జూలై 15 తారీఖుల్లో స్వీకరించబడవు.
భక్తులు ఈ అంశాలను గమనించి టిటిడి కి సహకరించవలసిందిగా కోరడమైనది.
TTD Executive Officer Sri J. Syamala Rao emphasised the need to provide quality food to the devotees visiting Tirumala for Srivari Darshan, through Big and Janata canteens.
On Wednesday, he held a meeting along with TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the TTD Administrative Building in Tirupati on Wednesday with the representatives of recognised hotel operators.
Speaking on the occasion, the EO stated that devotees come from all over the world to have darshan of Sri Venkateswara, and TTD has to serve them with dedication by providing hygienic, quality food items at fixed prices without a profit motive.
He informed that a notification was issued on June 23 for operating the Big and Janata canteens in Tirumala.
To address queries related to the EoI, the EO and the Additional EO organised a pre-bid meeting with interested and recognised hoteliers.
The EO and Additional EO urged the hotel operators to strictly follow hygiene and quality standards and serve food items at the prescribed prices in Big and Janata hotels.
During the meeting, recognised and interested hoteliers raised various questions and concerns regarding the tender process and related rules, which were clarified by the EO and the Additional EO.
Additional FACAO Sri Ravi Prasadu, Tirumala Estate Officer Sri K. Venkateswarlu, and representatives of several interested and recognised hotels participated in the meeting.
As part of the ongoing annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple in Nandlaluru, Annamaiah district, the Pallaki Utsavam was performed on 08 July in the morning. At 11 AM, Snapan Tirumanjanam was conducted to the utsava deity and in the evening, Dolotsavam was celebrated. At 7 PM, Sri Soumyanatha Swamy blessed the devotees on Hanumantha Vahanam. On 09 July, the deity will bless the devotees on Sesha Vahanam in the morning and Garuda Vahanam in the evening.
At Sri Siddheswara Swamy Temple in Tallapaka, Pallaki Seva and Chinna Sesha Vahana sevas were held while Simha Vahanam was observed for Sri Chennakesava Swamy
as part of the Brahmotsavams on Tuesday.
These events were attended by Superintendent Sri Hanumanthayya and Temple Inspector Sri Dilip while many devotees have also participated.
అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకి ఉత్సవం చేపట్టారు. ఉదయం 11 గం.లకు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి డోలోత్సవము చేప్టటారు. రాత్రి 07. 00 గం.లకు హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి భక్తులను అనుగ్రహించారు.
జూలై 09వ తేదీన ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
చిన్న శేష వాహనంపై శ్రీ సిద్దేశ్వర స్వామి :
తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం 06 - 07 గం.ల మధ్య చిన్నశేష వాహనంపై శ్రీ సిద్ధేశ్వర స్వామి విహరించారు.
జూలై 09న ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం సింహ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షిస్తారు.
సింహ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి
తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 07.00 గం.లకు సింహ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించారు.
జూలై 09వ తేదీ ఉదయం పల్లకీ సేవ చేపడుతారు. రాత్రికి హనుంత వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొన్నారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 08.00 నుండి 11.30 గంటల వరకు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, కవచ ప్రతిష్ట, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు.
అనంతరం శాత్తుమొరై, ఆస్థానం తదుపరి మధ్యాహ్నం 12.30 - 4.30 గం.ల మధ్య స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. అంతకుముందు తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామ తం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉభయ నాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ కె.మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగింది .
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది.