19.11.25

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం hindu dharma prachara parishat





టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు‌.


సమావేశంలోని ముఖ్యాంశాలు:

•  వచ్చే వేసవిలో తెలుగు రాష్ట్రాలలో 8,9,10 తరగతి విద్యార్థులకు ''సద్గమయ'' అను కార్యక్రమం ద్వారా నైతిక విలువలు, మానవీయ ధర్మాలు, వ్యక్తిత్వ నిర్మాణానికై శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం.

•  తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు రిజిస్టర్ అయిన 7856 భజన బృందాలు నైపుణ్యాన్ని పరిశీలించి జిల్లాస్థాయిలో భజన ప్రదర్శనలను ఏర్పాటు చేసి వాటిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీమతి జానకిదేవి, శ్రీ మహేందర్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్,  తదితరులు పాల్గొన్నారు.

స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

అంతకుముందు టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ కూడా  జరిగింది.

ఈ సమావేశంలో 236 స్టాఫ్ నర్సులు, 20 పారా మెడికల్ సిబ్బంది, 48 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించడం జరిగింది.

ఈ సమావేశంలో బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ సదాశివరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం donation




హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ మంగళవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

Culturals During Pedda Sesha Vahanam in Sri Padmavati Ammavari Temple

 CULTURALS DURING PEDDASESHA VAHANAM IN SRI PAT















నవంబర్ 19న మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం abhishekam




ఈనెల 19వ తేది తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఉదయం 10గం. ప్రత్యేక అభిషేకం జరగనుంది. 


కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.

Paramapadanadha Blesses Devotees on Pedda Sesha Vahanam








On the second morning as a part of ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Sri Padmavati Devi blessed Her devotees as Paramapadanada on the mighty Pedda Sesha Vahanam.


The seven hooded serpent king believed to be Adisesha carried the Goddess along mada streets to bless devotees who cherished the vahanam amidst rain.

Both the Pontiffs of Tirumala, EO Sri AK Singhal, JEO Sri Veerabrahmam, CVSO Sri Muralikrishna, DyEO Sri Harindranath and others were present.

పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి pedda sesha vahanam








తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.


శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహన సేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, పలువురు అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

18.11.25

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌








రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న ప‌దిరోజుల‌ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధ‌న్య‌త‌నిస్తున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు వెల్ల‌డించారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌న విధి విధాన‌ల‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో టీటీడీ చైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది.


స‌మావేశంలో ముఖ్యాంశాలుః

  • డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం.
  • ఈ పది రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయింపు.
  • సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలను, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ర‌ద్దు.
  • జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు online ద్వారా రోజువారీ 15వేల (రూ.300)ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 1000 శ్రీవాణి టికెట్లను regular ప‌ద్ధ‌తిలో కేటాయింపు.
  • ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. ప్రివిలేజ్ దర్శనాలు రద్దు.
  • స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
  • మొదటి మూడు రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్ లైన్ ఈ-డిప్ ద్వారానే కేటాయింపు.
  • రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు మొదటి మూడు రోజులకుగాను భక్తులు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ-డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేష‌న్ కు అవ‌కాశం.
  • న‌వంబ‌ర్‌ 27 నుండి 1వ తేది వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • డిసెంబర్ 2వ తేదిన డిప్ లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుంది.
•  జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5వేల టోకెన్లు చొప్పున స్థానికులు First In First Out పధ్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం.

స‌మావేశంలోని ఇత‌ర ముఖ్యాంశాలు
  • భ‌క్తుల మ‌నోభావాల‌ను దృష్టిలో వుంచుకుని ప‌ర‌కామ‌ణి కేసును నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ చేసి బాధ్యుల‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి నివేదించేందుకు బోర్డు నిర్ణ‌యం. ఈ కేసులో ఎంత‌టి వారున్నా బాధ్యుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని తీర్మానం.
•  ఈనెల 27వ తేదిన అమ‌రావ‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమిపూజ‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు పాల్గొంటారు.