10.12.25

టీటీడీ సేవలపై భక్తుల నుండి విస్తృతంగా అభిప్రాయాల సేకరణ feedback collection





టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి ఉద్దేశించి భక్తుల నుండి విలువైన అభిప్రాయాన్ని సేకరించేందుకు వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేలను టీటీడీ ప్రారంభించింది.


రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీటీడీ ఐవీఆర్ఎస్వాట్సాప్శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరిస్తోంది.


ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ సర్వే...


 సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవంఅన్న ప్రసాదంకళ్యాణ కట్టశ్రీవారి ఆలయంవసతిలగేజ్ కౌంటర్ మరియు ప్రైవేట్ హోటళ్ల ధరలపై మొత్తం 17 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.


వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం...


తిరుమలతిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే (వాట్సాప్‌ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.


ఇక్కడ భక్తులు తమ పేరువిభాగం (అన్నప్రసాదంశుభ్రతకల్యాణకట్టలడ్డూ ప్రసాదంలగేజీదర్శన అనుభవంక్యూలైన్గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.


అనంతరంఅభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకుని సేవా ప్రమాణాన్ని ఉత్తమంసగటు/మరింత మెరుగుదల అవసరంలేదా బాగాలేదు గా రేటింగ్ చేయాల్సి ఉంటుంది.


భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చు.


శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ


తిరుమలతిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారుఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.   


భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూసేవలను మరింత మెరుగుపరచడం కోసం  సర్వే ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది.


డయల్ యువర్ ఈవో ద్వారా....


ప్రతినెలా మొదటి శుక్రవారం టీటీడీ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలుసూచనలు స్వీకరిస్తారుఇందుకు భక్తులు 0877-2263261 కు కాల్ చేసి తమ అభిప్రాయాలను టీటీడీ ఈవోకు నేరుగా తెలుపవచ్చు.


-మెయిల్ ద్వారా అభిప్రాయాల సేకరణ...


టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా కూడా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.


వివిధ మాధ్యమాల ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలుసలహాలుసూచనలను పరిగణనలోకి తీసుకుని అధిక సంఖ్యలో భక్తులకు ఉపయోగపడేలా సేవలను మరింత నాణ్యంగా అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.

9.12.25

Sabarimala Sannidhanam 09th Dec 2025-04





 

Tiruppavai DIscourses from 16th Decmeber to 14th January - Tiruppavai Discourses at 233 Centers Across the County, including Tirupati




In view of the sacred Dhanurmasa, Tiruppavai discourses will be held from December 16, 2025, to January 14, 2026, at 233 centres across India by eminent scholars. These programmes are being organised under the auspices of the TTD Alwar Divya Prabandha Project.


As part of this initiative, discourses will be conducted at the following locations:


Andhra Pradesh – 76 centres


Telangana – 57 centres


Tamil Nadu – 73 centres


Karnataka – 21 centres


Puducherry – 4 centres


New Delhi – 1 centre


Odisha – 1 centre


During the Dhanurmasa period, Tiruppavai will be recited in place of Suprabhatam at the Tirumala Sri Venkateswara Temple. In Tirupati, Tiruppavai discourses and recitations will be held at the Annamacharya Kalamandiram and the Sri Varadaraja Swamy Temple on KT Road.


Sri Godadevi, one among 12 Alwars, composed the Tiruppavai—a set of 30 pasurams—explaining the method of performing this Dhanurmasa vratham. The essence of Tiruppavai is rendering service (kainkaryam) to the Supreme Lord. 


Scholars say that the vratham yields greater results when performed collectively rather than individually. In accordance with this tradition, Tiruppavai Sattumurai is conducted in all Vaishnava temples across the country during this auspicious month.

డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు - తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాలలో తిరుప్పావై tiruppavai



పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబ


రు 16 నుంచి 2026 జనవరి 14 తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.  టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్ర‌దేశ్ -76, తెలంగాణ -57, త‌మిళ‌నాడు- 73, క‌ర్ణాట‌క‌- 21, పాండిచ్చేరి- 4, న్యూఢిల్లీఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వ‌హించ‌నున్నారు 

తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషంతిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.

12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగాసుభిక్షంగా ఉంటుందిద్వాపరయుగంలో గోపికలు  వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.

 వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు .  సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది