8.3.26

టీటీడీ డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్ మరియు టెండర్ పోర్టల్ అభివృద్ధిపై అదనపు ఈవో సమీక్ష ttd addl eo





టీటీడీలో వస్తువుల కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగాసమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్ మరియు టెండర్ పోర్టల్ అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.


 పోర్టల్ ద్వారా కొనుగోలు మరియు టెండర్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు పలు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వెబ్ సైట్ ప్రోటోటైప్డిజైన్ పై అధికారులతో కలిసి చర్చించారు


సమావేశంలోని ముఖ్యాంశాలు 


•  టెండర్ ప్రక్రియలో పాల్గొనదలిచిన సరఫరాదారులు ముందుగా పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు కావాలి.


•  నమోదైన సరఫరాదారుల వివరాలుఅర్హతలు మరియు నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించి అర్హత కలిగిన రఫరాదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు.


•  భవిష్యత్ కొనుగోలు ప్రక్రియలకు ఉపయోగపడే విధంగా ధ్రువీకరించిన సరఫరాదారుల విశ్వసనీయ డేటాబేస్ రూపొందించబడుతుంది.


•   వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులుమధ్యవర్తులను గుర్తించి తొలగించడం సాధ్యమవుతుందిదీంతో టెండర్లలో నిజమైన సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించబడతాయి.


•  మార్కెట్ ధోరణులుధరల మార్పులుసరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.


•  టెండర్ ప్రక్రియసరఫరా నిర్వహణచెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానమవుతాయి.


•  డిజిటల్ విధానంలో చెల్లింపులు వేగంగా జరిగేలా  వ్యవస్థ సహకరిస్తుందిదీని ద్వారా సరఫరాదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.


•  పారదర్శక వ్యవస్థ కారణంగా ఎక్కు మంది అర్హత కలిగిన సరఫరాదారులు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.


•   పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగావేగంగా,  సమర్థవంతంగా నిర్వహించబడుతుంది.


  సమావేశంలో అడిషనల్ ఎఫ్ఏ&సీఏఓ రవి ప్రసాదుచీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ వెంకట రమణటీటీడీ ప్రోక్యూర్ మెంట్ జీఎం శ్రీమతి పద్మావతిఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేగంగా అభివృద్ధి పనులు : టిటిడి vontimitta temple




ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26 ప్రారంభం కానున్న నేపథ్యంలో  భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలుఅవసరమైన అభివృద్ధి పనులను  వేగంగా పూర్తి చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.


టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ ఎంరవిచంద్ర సూచనల మేరకు టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారుగత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.


 సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని  టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అధికారులను దేశించారుముఖ్యంగా మసకబారిన వాహనాలకు పాలిషింగ్ చేయడంఅభిషేకం పీఠంతాండ్లు తదితర వస్తువులకు బ్రాస్ లైనింగ్ ఏర్పాటు చేయాలని సూచించారుఅలాగే గజ వాహనానికి అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు తెలిపారు.


ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయం చుట్టుపక్కల వీధుల్లో కూల్ పెయింటింగ్ వేయాలని సూచించారుఅలాగే భక్తులకు తాగునీటి సౌకర్యం మెరుగుపరచేందుకు ఆర్.వాటర్ ప్లాంట్లు మరియు కూలర్ల నిర్వహణ పనులు చేపట్టాలని తెలిపారు.


ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాష్‌రూమ్స్ / టాయిలెట్స్‌లో అవసరమైన ట్యాపులుతలుపులుకమోడ్లకు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.


 అలాగే యాగశాలను అందంగాశాస్త్రీయంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలని కోరారుబ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని టిటిడి జేఈవో అధికారులను ఆదేశించారు.

TTD Speeds up Development Worksfor Sri Kodadarama Swmay Vari Temple Annual Brahmotsavams




In view of the Annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple at Ontimitta commencing from March 26, TTD has initiated measures to complete the required development works and provide better amenities for the devotees.


As per the directions of TTD Chairman Sri B.R. Naidu and EO Sri M. Ravichandra, TTD JEO Sri V. Veerabrahmam is supervising the development works. Taking past experiences into consideration, TTD is taking special steps to ensure that devotees do not face any inconvenience during the Brahmotsavams and that improved facilities are provided.


On this occasion, JEO Sri V. Veerabrahmam instructed the officials to immediately complete all the pending development works. He directed that the temple vehicles which have lost their shine be polished and that brass lining be arranged for the Abhishekam pedestal, stands and other related items. He also instructed the officials to take up necessary repairs for the Gaja Vahanam.


As the summer heat is expected to be severe this year, he suggested that cool painting be done on the surrounding streets of the temple to provide relief to the devotees. He also directed the officials to take up maintenance works of RO water plants and water coolers to improve drinking water facilities.


Further, the officials were instructed to immediately undertake repairs to taps, doors and commodes in the washrooms and toilets located in and around the temple premises.


He also asked the officials to develop the Yagasala in an aesthetically pleasing and traditional manner. The JEO directed that all the development works should be completed before the commencement of the Brahmotsavams to ensure that devotees do not face any inconvenience.

తిరుమల అశ్విని ఆసుపత్రిని తనిఖీ చేసిన టీటీడీ జేఈవో (విద్య, వైద్య) డా. ఎ. శరత్ aswini hospital



తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రి మరియు డిస్పెన్సరీలను టీటీడీ జేఈవో (విద్యవైద్యడాశరత్ శనివారం ఉదయం తనిఖీ చేశారు


 సందర్భంగా వైద్య సేవల నిర్వహణభక్తులకు అందుతున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.


అశ్విని ఆసుపత్రిడిస్పెన్సరీలలో ప్రవేశనిష్క్రమణ ద్వారాలను భక్తులకు స్పష్టంగా తెలియజేసేలా తగిన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు


రక్తదానానికి సంబంధించిన వివరాలను ఓపీ నమోదు రిజిస్టర్‌లో కాకుండా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారుఅశ్విని ఆసుపత్రిలో ఈసీజీ పరీక్షలు చేయించుకునే రోగుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని తెలిపారుక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు పీఏసీ–5 ఉచిత డిస్పెన్సరీలో వెంటనే ఒక వైద్యుడిని నియమించాలని ఆదేశించారు.


అశ్విని ఆసుపత్రి వద్ద ప్రవేశ ద్వారం లేదా వెనుక భాగంలో భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించారుఅలాగే జీఎన్‌సీ వద్ద భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు.


అదేవిధంగా రోగుల నమోదు వివరాలను  కేస్ షీట్‌లో వ్యాధి నిర్ధారణను స్పష్టంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.


 తనిఖీలో టీటీడీ సిఎంవో డాకుసుమ కుమారిఅశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాసుబ్బా రెడ్డిఇతర అధికారులువైద్యులు పాల్గొన్నారు.




Sri Vedanarayana Swamy Vari Surya Puja and Teppotsavams from 24th to 28th March- Matsya Jayanthi on 21st March




The annual Surya Puja Mahotsavam and Teppotsavams of Sri Vedanarayana Swamy along with Sri Vedavalli Ammavaru at Nagalapuram will be held in a grand manner from March 24 to 28.


According to legend, after Lord Mahavishnu incarnated as Matsya and fought a prolonged battle, the Sun God (Surya Bhagavan) is believed to have showered his rays upon the deity to provide warmth to the divine body. As part of this unique celestial event, the sun’s rays fall directly on the main deity (Moolavirat) located about 630 feet from the main Rajagopuram. On the first day the rays fall on the feet, on the second day on the navel, and on the third day on the head of the deity, illuminating the divine form of the Lord.


During the annual Surya Puja Mahotsavam and Teppotsavams from March 24 to 28, Snapana Tirumanjanam will be performed to the Utsava Murthis of the Lord and His consorts every day from 9 am to 10 am. Devotees will be allowed for Surya Puja Darshan from 5.30 pm to 6.30 pm, followed by Tiruveedhi Utsavam from 7.30 pm to 9 pm.

Teppotsavams from March 24

The five-day Teppotsavams will also be held at the temple tank from March 24 to 28, every day from 6.30 pm to 7.30 pm.


Day 1: Sri Vedanarayana Swamy with Sridevi and Bhudevi


Day 2: Sri Vedanarayana Swamy with Goda Devi


Day 3: Sri Kodandarama Swamy with Sita and Lakshmana


Day 4: Sri Vedanarayana Swamy with Sridevi and Bhudevi


Day 5: Sri Vedanarayana Swamy with Sridevi and Bhudevi


After the Teppotsavams, Tiruchi (Tiruveedhi) Utsavam of the Lord and His consorts will be held on the first three days, Mutyapu Pandiri Vahanam on the fourth day, and Pedda Sesha Vahanam on the fifth day.


Matsya Jayanti on March 21


The Matsya Jayanti will be celebrated grandly on March 21 at the temple.


On this occasion, the Lord will be awakened with Suprabhatam at 5 am, followed by Thomala Seva and Archana. Later, Matsya Jayanti Tiruveedhi Utsavam of Sri Vedanarayana Swamy along with Sridevi and Bhudevi will be held from 7 am to 8.30 am.


Shanti Homam will be performed from 9 am to 11 am, followed by Snapana Tirumanjanam from 11 am to 12 noon. In the evening, the Lord will bless devotees with a Garuda Vahana procession from 7 pm to 9 pm in the temple streets.


On this occasion, spiritual, devotional and musical programmes will be organized every evening under the auspices of the TTD Annamacharya Project.