8.3.26

మార్చి 24 నుండి 28వ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామి వారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాలు - మార్చి 21న మత్స్య జయంతి vedanarayana swamy vari temple




నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి వార్షిక సూర్యపూజ మహోత్సవంతెప్పోత్సవాలు మార్చి 24 నుండి 28 తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  


శ్రీమహావిష్ణువు మత్స్యావతారం రూపంలో సంవత్సరాల కొలది యుద్ధం చేసి వచ్చినందునస్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం ఉత్సవంలో ప్రధా రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో గల మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయిమొదటి రోజు స్వామివారి పాదాలపైరెండో రోజు నాభిపైనమూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని రింత తేజోవంతం చేస్తాయి.


మార్చి 24 నుండి 28 తేదీ వరకు జరుగనున్న వార్షిక సూర్యపూజ మహోత్సవంతెప్పోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారుసాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పించనున్నారురాత్రి 7.30 గంటల నుండి 9.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.


మార్చి 24 నుండి తెప్పోత్సవాలు :


శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28 తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయిప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారుమొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారురెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారుమూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారునాల్గవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామివారుఐదవ రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారుతెప్పోత్సవాల అనంతరం మొదటి మూడు రోజులు స్వామిఅమ్మవార్ల (తిరుచ్చితిరువీధి ఉత్సవంనాల్గవ రోజు ముత్యపుపందిరి వాహనంఐదవ రోజు పెద్దశేష వాహనంపై స్వామివారు క్తులకు దర్శనమిస్తారు.


మార్చి 21 మత్స్య జయంతి :


శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 21 తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.


 సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పితోమాలఅర్చన నిర్వహించనున్నారుఅనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమే శ్రీ వేదనారాయణస్వామివారికి త్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవంనిర్వహిస్తారుఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమంఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల రకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారురాత్రి 7 నుండి గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు  భక్తులను అనుగ్రహిస్తారు.


 సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మికభక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ – పేదల ప్రాణాలకు వరం sv pranadana trust




తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ఆధ్వర్యంలోని టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ పేద వర్గాల ప్రాణాలకు వరంగా నిలుస్తోందిరాయలసీమ జిల్లాలలో గుండెమూత్రపిండాలుక్యాన్సర్న్యూరో సంబంధిత ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఖరీదై వైద్య చికిత్సలను ఉచితంగా అందించాలనే దివ్యసంకల్పంతోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర ప్రాణదా ట్రస్ట్ ను 2001 అక్టోబర్ 01 ప్రారంభించారు.


 మహోన్నత సేవా కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో కొనసాగుతూపేద రోగులకు ప్రాణాధారంగా నిలుస్తోంది.


దీర్ఘకాలిక వ్యాధులకు సహాయం


 ట్రస్ట్ ద్వారా దీర్ఘకాలిక మరియు నిర్ధిష్ట వ్యాధుల చికిత్సతో పాటు వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయిముఖ్యంగా – దీర్ఘకాలి మూత్రపిండాల వైఫల్యంహీమోఫిలియాథలసేమియాక్యాన్సర్గుండె జబ్బులునాడీ సంబంధిత వ్యాధులుఅటాక్సియాకొరియాహెమిబాలిస్మస్అఫాసియా వంటి న్యూరోలాజికల్ తదితర వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉపశమనం కలిగేలా ప్రణాళికాబద్ధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారుపేద రోగులకు వైద్య ఖర్చులుశస్త్రచికిత్సలుకృత్రిమ అవయవాలుఇంప్లాంట్లుబ్లడ్ బ్యాంక్ లాంటి వైద్ సేవలను ఎలాంటి వివక్ష లేకుండా  అందిస్తున్నారు.


ఆర్థిక సహాయం పెంపు


పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ నుండి వివిధ దశల్లో నిధులను పెంచుతూ వచ్చారు: 22.02.2003 తేదీ నుండి నెలకు రూ. 15 లక్షలు, 30.04.2005 – రూ. 25 లక్షలు, 24.03.2006 – రూ. 30 లక్షలు, 30.01.2008 – రూ. 50 లక్షలు,  02.04.2014 – నెలకు రూ. 1 కోటి ఖర్చు చేస్తున్నారు.


దాతల సహకారం


ఎస్వీ ప్రాణ దాణ ట్రస్ట్ కు ఇప్పటి వరకు 51,957 మంది దాతలు దాదాపు రూ. 520 కోట్లును విరాళాలను అందించారు.


2001, నవంబర్ నుండి 2026, ఫిబ్రవరి వరకు దాదాపు రూ. 158 కోట్ల ఖర్చుతో సుమారు 27,710 పైచిలుకు రోగులు  ట్రస్ట్ ద్వారా వైద్య సేవలను పొందారు.


ఎంపిక విధానం


దారిద్య్ర రేఖకు దిగువనున్న రోగులను ఎస్వీ ప్రాణదాన ఎంపిక కమిటీ పరిశీలించి ఉచిత చికిత్సకు ఎంపిక చేస్తుందికన్సల్టెంట్ వైద్యుడు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారుఆరోగ్య కార్డులుఅధికా రికార్డులు పరిశీలిస్తారుచికిత్స ఖర్చు అంచనా వేసి ఆమోదం పొందిన తర్వాత వైద్య సేవలు అందిస్తారుస్విమ్స్ డైరెక్టర్ కమ్ వీసీ ద్వారా పంపిన కేసులను డాఎన్.టి.ఆర్వైద్య సేవా ట్రస్ట్ పోర్టల్‌లో తనిఖీ చేసి నమోదు చేస్తారుఅత్యవసర కేసుల్లో తక్షణ ధృవీకరణతో చికిత్స అందిస్తారు.


ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ – రక్తదాన సేవల విస్తరణ


2007లో ప్రారంభమైన ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ రక్తదాన సేవలను విస్తృతంగా అమలు చేస్తోందిఉచిత రక్తం మరియు రక్త భాగాల పంపిణీ, స్వచ్ఛంద రక్తదాన ప్రోత్సాహంఅత్యవసర సేవలుప్రజల్లో అవగాహన కార్యక్రమాలుటిటిడి పరిధిలోని రక్తనిధుల ద్వారా సేకరించిన రక్తాన్ని పూర్తిగా ఉచితంగా అందించడం  ట్రస్ట్ ప్రత్యేకతముఖ్యంగా గర్భిణీ స్త్రీలుప్రమా బాధితులుగుండె శస్త్రచికిత్ రోగులుథలసేమియా చిన్నారులు, అత్యవసర శస్త్రచికిత్స రోగులకు తక్షణ సహాయం అందిస్తూ అనేక ప్రాణాలను కాపాడుతోంది.


భక్తుల భాగస్వామ్యం


ఒక యూనిట్ రక్తం – మూడు ప్రాణాలకు ఆశ” అనే నినాదంతో యువతను రక్తదానానికి ప్రేరేపిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుతిరుమలకు విచ్చేసే భక్తులు తమ ర్శన యాత్రను రక్తదానంతో మరింత పుణ్యమయంగా మార్చుకుంటున్నారుటిటిడి పర్యవేక్షణలో నడిచే  ట్రస్ట్ పూర్తిస్థాయి పారదర్శకతతో సేవలను అందిస్తోందిరక్త సేకరణనిల్వపరీక్షలుపంపిణీ ప్రక్రియల్లో జాతీయ వైద్య ప్రమాణాలను  పాటిస్తోంది.


సమాజానికి సందేశం


ప్రాణదానం అనేది పరమదానంఒకరి రక్తదానం మరొకరి జీవితాన్ని కాపాడగలదుఒకరి ఆర్థిక సహాయం మరొకరి ప్రాణాలకు ఆధారం అవుతుందనే సేవ దృక్పథంతో వైద్య సేవలను అందిస్తున్నారుశ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో కొనసాగుతున్న  ప్రాణదాన సేవలు మరింత విస్తరించిరెన్నో పేద కుటుంబాలకు వెలుగులు నింపేందుకు టిటిడి కృషి చేస్తోంది.

International Women Day Celebrations at Mahati on 9th March



TTD will organize the International Women’s Day cel


ebrations on March 9 at Mahati Kalakshetram in Tirupati.


The programme will commence at 10:00 AM. On this occasion, several eminent women personalities will attend and address the gathering.

Women employees of TTD, including regular and outsourcing staff, will participate in the event. As part of the celebrations, women employees who are retiring during this year will also be felicitated.


The arrangements for the programme are being supervised by TTD Welfare Department Deputy Executive Officer Sri Anandaraju.