16.3.26

అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన స‌ప్త‌గిరులు annamaiah









పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఆదివారం సాయంత్రం శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఊంజల్‌సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో స‌ప్త‌గిరులు పులకించాయి.


 కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46 మఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు.


అన్నమయ్యకువారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారుఅన్నమయ్య విద్యాభ్యాసంవేదశాస్త్రాల అధ్యయనం క్కడే సాగిందని చెప్పారుఅహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్ 32 వేల సంకీర్తనలు రచించారన్నారు.


అనంతరం అహోబిల మఠం తరఫున శ్రీ తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి వస్త్రం సమర్పించారుటీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వామీజీని శాలువాతో సత్కరించి  ప్రసాదాలు అందజేశారు.


 సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ అన్నమాచార్యుల వారి వర్ధంతిని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. 1975లో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుండి దాదాపు మూడు వేల సంకీర్తనలను రికార్డు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినట్లు చెప్పారు. అమెరికా దేశంలోని దాదాపు వెయ్యి ఆలయాల్లో అన్నమాచార్యుల సంకీర్తనలను గానం చేస్తున్నారన్నారుఅన్నమాచార్యులు పామరులకు కూడా అర్థమయ్యే భాషలో సంకీర్తనలు రచించారని తెలిపారుప్రస్తుత ఆధుని సమాజానికి అన్నమయ్య సంకీర్తనలు ఎంతో అవసరం ఉందని తెలియజేశారు.


అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన వివిధ సంకీర్తనలు క్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయిసింగపూర్ మరియు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భజన బృందాల సభ్యులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.


చివరగా టీటీడీ తరఫున తాళ్లపాక వంశీయులను అదనపు ఈవో సత్కరించారు.


 కార్య‌క్ర‌మంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్డైరెక్టర్ శ్రీమతి లతఇతర అధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Sri Vari Saptahvarna Pushpayagam Celebrated with Floral Splendour









The Pushpayagam Mahotsavam was held in a grand manner on Sunday at the Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram.


On this occasion, Vedic rituals were performed in the Yagasala from 7 a.m. to 10 a.m. Later, from 10 a.m. to 11 a.m., Snapana Tirumanjanam was performed to the Utsava deities of Sri Kalyana Venkateswara Swamy along with Sridevi and Bhudevi. The sacred abhishekam was carried out with milk, curd, honey, coconut water, turmeric, and sandalwood.


From 2 p.m. to 4 p.m., the Pushpayagam was conducted in a visually delightful manner. The ritual was performed using 12 varieties of flowers and 6 types of sacred leaves. The flowers included chrysanthemum, roses, oleander, champak, jasmine, rukshi, kanakambaram, lotus, water lily, mogali flowers and manu sampangi. Leaves such as tulasi, davanam, maruvam, bilvam and panneeru leaves were also used.


A total of four tonnes of flowers were donated by devotees for the Pushpayagam. These flowers were received as offerings from the states of Tamil Nadu, Karnataka, Andhra Pradesh and Telangana.


Among those who participated in the programme were Temple Special Grade Deputy EO Smt. Varalakshmi, Garden Superintendent, Sri Srinivasulu, Garden Manager Sri Janardhan Reddy, Superintendent, Sri Rajkumar, Temple Archaka Sri Balaji Rangacharyulu and Temple Inspectors Sri Munikumar and Sri Dhanasekhar.

పూల సుగంధాలతో అలరించిన శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం puspayagam









శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.


 సందర్భంగా ఆదివారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారుదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంల‌తో అభిషేకం చేశారు.


మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో  స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారుచామంతిరోజాలుగన్నేరుసంపంగిల్లెలురుక్షికనకాంబరాలుతామరకలువమొగలిరేకులుమాను సంపంగి పుష్పాలుతులసిదవనంమరవంబిల్వంపన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారుపుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారుతమిళనాడుకర్నాటకఆంధ్ర‌ప్ర‌దేశ్తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.  


 కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిగార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులుగార్డెన్ మేనేజర్ శ్రీ జనార్దన్ రెడ్డిసూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులుటెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌ పాల్గొన్నారు.

Grand Commencement of Sri Thalapaka Annamacharay 523rd Vardhanti Mahotsavams







The 523rd Vardhanti Mahotsavams of Sri Tallapaka Annamacharya commenced grandly on Sunday at Annamacharya Kalamandiram in Tirupati under the auspices of the TTD Hindu Dharmic Projects.


On this occasion, the group rendition of Saptagiri Sankeertanas by the artists of the Annamacharya Project captivated the audience.


At 9 a.m., the artists of the Annamacharya Project along with local artists, melodiously rendered Dwadashi and Saptagiri Sankeertanas. The artists sang popular compositions including “Brahma Kadigina Paadamu…”, “Saranantu…”, “Hari Avataramithadu Annamayya…”, and “Saranu Saranu…”. Later, Harati and Mahanivedana were performed.


At Tallapaka, abhishekam was performed to the idol of Annamacharya at the Annamacharya Dhyanamandiram near the 108-foot statue. As part of the ritual, the idol was ceremonially cleansed with water and offered sacred abhishekam with milk, curd, honey, sugar, coconut water, turmeric, sandalwood and other fragrant substances, amid Vedic chanting by priests.


Later, the idol was adorned with silk garments and flower garlands, followed by Dhupa, Deepa, Naivedyam and Karpura Harati. Devotees of Annamayya had darshan and received Theertha Prasadams.


Artists of the Annamacharya Project also participated in Nagara Sankeertana and performed group renditions. From 8 a.m. to 11 a.m., the artists rendered Saptagiri Sankeertana Goshti Gaanam.


As part of the evening programmes, a music concert will be held from 6.30 p.m. to 8 p.m., followed by Harikatha from 8 p.m. to 9.30 p.m.

ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 523వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం - అన్నమాచార్య కళామందిరంలో ఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం annamacharya








 శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల  ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి


 సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.


ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులుస్థానిక కళాకారులు క‌లిసి  ద్వాదశిసప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారుఇందులో ''బ్రహ్మకడిగిన పాదము...., శరణంటూ..., హరి అవతారమితడు అన్నమయ్య..,  శరణు శరణు...'' కీర్తనలను కళాకారులు ఆలపించారుఅనంతరం హారతిమహానివేదన చేపట్టారు.


తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం వద్ద.... అన్నమాచార్యుల 


ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి అభిషేకం జరిగిందిఅభిషేకంలో భాగంగా అన్నమయ్య విగ్రహానికి జలంతో శుద్ధి గావించి పాలుపెరుగుతేనెపంచదారటెంకాయనీరుపసుపుగంధంసుగంధపరిమళ ద్రవ్యాలతో అర్చక వేద మంత్రోత్సవాల నడుమ అభిషేకం జరిగింది


అనంతరం అన్నమయ్య విగ్రహానికి పట్టు వస్త్రాలుపుష్పమాలతో అలంకరించి ధూప దీప నివేదన కర్పూర హారతి అన్నమయ్య భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు


అన్నమాచార్య ప్రాజెక్టు వారు నగ సంకీర్తనలో పాల్గొని గోష్టి గానం నిర్వహించారుఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు..


సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు  సంగీత సభరాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు హరికథ గానం చేయనున్నారు.